ఈ ఐపీఎల్ సీజన్లో ప్రతి మ్యాచ్ను చావో రేవో అన్నట్టుగానే ఆడామని హైదరాబాద్ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ చెప్పాడు. లీగ్ చివరి మ్యాచ్లో గెలిచినందుకు సంతోషంగా ఉందని అన్నాడు. మంగళవారం జరిగిన మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయిని 10 వికెట్ల తేడాతో ఓడించి, ఫ్లేఆప్స్లో అడుగుపెట్టింది సన్రైజర్స్.
"ప్రతి మ్యాచులో చావో రేవో అన్నట్టుగానే తలపడాలన్నదే మా ఉద్దేశం. మా ఆటగాళ్లలో కొందరు గాయపడ్డారు. గతంలో గాయపడ్డ విలియమ్సన్ స్థానంలో బెయిర్ స్టో రాణించాడు. నదీమ్ అద్భుతంగా బౌలింగ్ వేశాడు. జట్టుకు శుభారంభం ఇచ్చినందుకు గర్వంగా ఉంది. నాకౌట్ దశలోనూ ఇదే జోరు కొనసాగిస్తే టైటిల్ గెలిచే అవకాశం మాకే ఉంది. బెంగళూరును కోహ్లీ చక్కగా నడిపిస్తున్నాడు. వారెంతో ప్రమాదకరం. 2016 ఫైనల్లో మేం వారిని ఓడించాం. మళ్లీ ఇప్పుడు అదే పని చేయాల్సి వస్తుండటం ఆసక్తికరంగా అనిపిస్తోంది."
-- డేవిడ్ వార్నర్, సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్