కోల్‌కతాదే విజయం
సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా విజయం సాధించింది. సూపర్ ఓవర్ ద్వారా ఫలితం తేలిన మ్యాచ్‌లో కేకేఆర్ సునాయాసంగా గెలిచింది. సూపర్ ఓవర్లో 3 పరుగులు చేయాల్సి ఉండగా కార్తిక్, మోర్గాన్ లక్ష్యాన్ని నాలుగు బంతుల్లో పూర్తి చేశారు.
19:47 October 18
కోల్‌కతాదే విజయం
సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా విజయం సాధించింది. సూపర్ ఓవర్ ద్వారా ఫలితం తేలిన మ్యాచ్‌లో కేకేఆర్ సునాయాసంగా గెలిచింది. సూపర్ ఓవర్లో 3 పరుగులు చేయాల్సి ఉండగా కార్తిక్, మోర్గాన్ లక్ష్యాన్ని నాలుగు బంతుల్లో పూర్తి చేశారు.
19:40 October 18
కోల్‌కతా లక్ష్యం 3 పరుగులు
సూపర్ ఓవర్లో బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ కేవలం 2 పరుగులే చేసింది. పెర్గుసన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కోల్‌కతా 3 పరుగులు చేస్తే విజయం సాధిస్తుంది.
19:25 October 18
సూపర్ ఓవర్‌కు సన్‌రైజర్స్-కోల్‌కతా మ్యాచ్
సన్‌రైజర్స్-కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ టై అయింది. 164 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన సన్‌రైజర్స్ నిర్ణీత ఓవర్లలో అవే పరుగులు చేసింది. దీంతో సూపర్ ఓవర్ ద్వారా ఫలితం తేలనుంది.
కెప్టెన్ డేవిడ్ వార్నర్ 47 పరుగులతో నాటౌట్‌గా నిలిచి మ్యాచ్ టై కావడంలో కీలకపాత్ర పోషించాడు. ఓపెనర్లు బెయిర్ స్టో (36), విలియమ్సన్ (29) మొదటి వికెట్‌కు 57 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. కానీ మిగతా బ్యాట్స్‌మెన్ విఫలమవడం వల్ల మ్యాచ్ ఉత్కంఠకు దారితీసింది. చివర్లో వార్నర్ జోరుతో టై అయింది.
19:21 October 18
6 బంతుల్లో 18 పరుగులు
సన్‌రైజర్స్ గెలవాలంటే చివరి 6 బంతుల్లో 18 పరుగులు చేయాల్సి ఉంది.
19:13 October 18
తడబడుతోన్న సన్‌రైజర్స్
164 పరుగుల లక్ష్య చేధనతో బరిలో దిగిన సన్‌రైజర్స్ తడబడుతోంది. ప్రస్తుతం 18 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. విజయం కోసం ఇంకా 12 బంతుల్లో 30 పరుగులు చేయాల్సి ఉంది. వార్నర్ (28), సమద్ (16) క్రీజులో ఉన్నారు.
18:56 October 18
లక్ష్య చేధనలో తడబడుతోన్న సన్‌రైజర్స్
కోల్‌కతాతో జరుగుతోన్న మ్యాచ్‌లో లక్ష్య చేధనలో సన్‌రైజర్స్ తడబడుతోంది. ప్రస్తుతం 15.2 ఓవర్లకు 5 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. గెలుపు కోసం ఇంకా 28 బంతుల్లో 55 పరుగులు చేయాల్సి ఉంది.
18:36 October 18
ఫెర్గుసన్ సత్తా.. తడబడుతోన్న సన్‌రైజర్స్
కోల్‌కతా నైట్‌రైడర్స్ నిర్దేశించిన 164 పరుగుల లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్ హైదరాబాద్ నాలుగు వికెట్లు కోల్పోయింది. ఫెర్గుసన్ వేసిన ఆరో ఓవర్ తొలి బంతికి విలియమ్సన్(29) బౌండరీ లైన్ వద్ద నితీశ్ రాణా చేతికి చిక్కాడు. తర్వాత మళ్లీ ఫెర్గుసన్ వేసిన ఎనిమిదో ఓవర్లో ప్రియమ్ గార్గ్ (4) బౌల్డయ్యాడు. మళ్లీ 12వ ఓవర్ వేసిన ఫెర్గుసన్ ఈసారి మనీశ్ పాండే (6)ను బౌల్డ్ చేశాడు. దీంతో మూడు వికెట్లతో సన్‌రైజర్స్ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశాడు. ప్రస్తుతం 13 ఓవర్లకు 89 పరుగులు చేసింది హైదరాబాద్. వార్నర్, విజయ్ శంకర్ క్రీజులో ఉన్నారు.
18:22 October 18
వరుసగా రెండు వికెట్లను కోల్పోయింది సన్‌రైజర్స్. ప్రియమ్ గార్గ్(4), బెయిర్ స్టొ(39) పెవిలియన్ చేరారు. క్రీజులో వార్నర్(1), మనీశ్ పాండే(3) ఉన్నారు. పది ఓవర్లు పూర్తయ్యేసరికి మూడు వికెట్లు కోల్పోయి 74 పరుగులు చేసింది వార్నర్ సేన.
18:10 October 18
సన్‌రైజర్స్ తొలి వికెట్ కోల్పోయింది. కేన్ విలియమ్సన్(29) పెవిలియన్ చేరాడు. క్రీజులోకి ప్రియమ్ గర్గ్ వచ్చాడు. బెయిర్ స్టో(28) జాగ్రత్తగా ఆడుతోన్నాడు. దీంతో ఆరు ఓవర్లు పూర్తయ్యేసరికి 57పరుగులు చేసింది వార్నర్ సేన.
17:58 October 18
ఐదు ఓవర్లు పూర్త్యయ్యేసరికి సన్‌రైజర్స్ వికెట్ ఏమీ కోల్పోకుండా 46 పరుగులు చేసింది. క్రీజులో కేన్ విలియమ్సన్(22) బెయిర్ స్టో(24) నిలకడగా ఆడుతోన్నారు.
17:43 October 18
నెమ్మదిగా సన్‌రైజర్స్ బ్యాటింగ్
164 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన సన్‌రైజర్స్ నెమ్మదిగా బ్యాటింగ్ చేస్తోంది. రెండు ఓవర్లు పూర్తయ్యే సరికి 12 పరుగులు చేసింది. విలియమ్సన్ (9), బెయిర్ స్టో (3) క్రీజులో ఉన్నారు.
17:21 October 18
సన్‌రైజర్స్ లక్ష్యం 164
సన్‌రైజర్స్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. దీనేశ్ కార్తీక్ 29, మోర్గాన్ 34 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. గిల్ (36), రానా (29), రాహుల్ త్రిపాఠి (23) పర్వాలేదనిపించారు. సన్‌రైజర్స్ బౌలర్లలో నటరాజన్ 2, థంపి, రషీద్ ఖాన్ చెరో వికెట్ సాధించారు.
16:57 October 18
తడబడుతోన్న కోల్‌కతా
సన్‌రైజర్స్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో కోల్‌కతా మొదట బ్యాటింగ్ చేస్తోంది. ఆరంభంలో నిలకడగా ఆడిన జట్టు ప్రస్తుతం తడబడుతోంది. 16 ఓవర్లు పూర్తయ్యే సరికి 4 వికెట్ల నష్టానికి 111 పరుగులు చేసింది. గిల్ (36), రానా (29), రాహుల్ త్రిపాఠి (23) పర్వాలేదనిపించారు. ప్రస్తుతం సారథి ఇయాన్ మోర్గాన్‌తో క్రీజులో ఉన్నాడు కార్తిక్.
16:19 October 18
ఆచితూచి కోల్‌కతా బ్యాటింగ్
కోల్‌కతా నిలకడగానే బ్యాటింగ్ చేస్తోంది. ప్రస్తుతానికి 9 ఓవర్లు పూర్తయ్యే సరికి వికెట్ నష్టానికి 64 పరుగులు చేశారు. రానా (9), గిల్ (32) ఆచితూచి ఆడుతున్నారు.
16:04 October 18
నిలకడగా కేకేఆర్ బ్యాటింగ్
కోల్‌కతాతో జరుగుతోన్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం 7 ఓవర్లు పూర్తయ్యే సరికి కేకేఆర్ వికెట్ నష్టానికి 53 పరుగులు చేసింది.
15:40 October 18
నిలకడగా కోల్‌కతా బ్యాటింగ్
సన్‌రైజర్స్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేస్తోన్న కోల్‌కతా రెండు ఓవర్లకు 12 పరుగులు చేసింది. గిల్ (3), రాహుల్ త్రిపాఠి (9) నిలకడగా ఆడుతున్నారు.
15:08 October 18
ఇరుజట్లు
కోల్‌కతా నైట్‌రైడర్స్
రాహుల్ త్రిపాఠి, శుభ్‌మన్ గిల్, నితీశ్ రానా, దినేశ్ కార్తీక్, ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), ఆండ్రూ రసెల్, కమిన్స్, శివం మావి, కుల్దీప్ యాదవ్, ఫెర్గుసన్, వరుణ్ చక్రవర్తి
సన్‌రైజర్స్ హైదరాబాద్
డేవిడ్ వార్నర్ (కెప్టెన్), బెయిర్‌స్టో, మనీశ్ పాండే, కేన్ విలియమ్సన్, ప్రియమ్ గార్గ్, విజయ్ శంకర్, అబ్దుల్ సమద్, రషీద్ ఖాన్, సందీప్ శర్మ, టి నటరాజన్, బాసిల్ థంపి
14:40 October 18
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్
సన్‌రైజర్స్ బౌలింగ్
అబుదాబి వేదికగా మరో రసవత్త పోరుకు రంగం సిద్ధమైంది. ఎనిమిది మ్యాచుల్లో నాలుగు గెలిచి, నాలుగో స్థానంలో ఉన్న కోల్‌కతా... ఐదో స్థానంలో ఉన్న హైదరాబాద్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. తాము ఆడిన గత మ్యాచుల్లో ఓడిన ఇరుజట్లు.. ఈ సారి ఎలాగైనా సరే గెలవాలనే పట్టుదలతో ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో మొదట టాస్ గెలిచిన సన్‌రైజర్స్ బౌలింగ్ ఎంచుకుంది.