తెలంగాణ

telangana

ETV Bharat / sports

ముంబయిపై హైదరాబాద్​ విజయం.. ప్లేఆఫ్స్​లో వార్నర్​సేన - హైదరాబాద్ స్క్వాడ్ టుడే

IPL 2020: SRH vs MI match live updates
SRH vs MI match live updates

By

Published : Nov 3, 2020, 7:02 PM IST

Updated : Nov 3, 2020, 11:04 PM IST

22:59 November 03

సన్​రైజర్స్​దే గెలుపు

150 పరుగులే లక్ష్యంగా బరిలో దిగిన సన్​రైజర్స్​ హైదరాబాద్​ జట్టు 17.1 ఓవర్లలోనే ఛేధించింది. ఓపెనర్లు డేవిడ్​ వార్నర్​ (85), వృద్దిమాన్​ సాహా (58) రెచ్చిపోయి బ్యాటింగ్​ చేసి తమ జట్టుకు విజయాన్ని అందించారు. ఈ గెలుపుతో వార్నర్​సేన ప్లేఆఫ్స్​కు చేరిన నాలుగో జట్టుగా నిలిచింది. 

22:25 November 03

ఆడుతూ పాడుతూ ఛేదన..

ఛేదనలో సన్​రైజర్స్​ దూకుడుగా ఆడుతోంది. 12 ఓవర్లు ముగిసేసరికి వికెట్​ కోల్పోకుండా 110 పరుగులు చేసింది. వార్నర్​(58), సాహా(50) నిలకడగా ఆడుతున్నారు. 

21:42 November 03

ఆచితూచి ఆడుతున్న సన్​రైజర్స్​

150 లక్ష్యఛేదనతో బ్యాటింగ్​కు దిగిన సన్​రైజర్స్​ హైదరాబాద్​ జట్టు.. 2 ఓవర్లకు వికెట్​ నష్టపోకుండా 14 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్​లో డేవిడ్​ వార్నర్​ (1), వృద్దిమాన్​ సాహా (12) ఉన్నారు. 

21:24 November 03

సన్​రైజర్స్​ లక్ష్యం 150

టాస్​ ఓడి తొలుత బ్యాటింగ్​ చేసిన ముంబయి ఇండియన్స్​.. హైదరాబాద్​ బౌలర్ల ధాటికి ఆది నుంచి తడబడతూ బ్యాటింగ్​ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టపోయిన రోహిత్​సేన 149 పరుగులు చేసింది. పవర్​ప్లేలో రోహిత్​, డికాక్​ వంటి స్టార్​ ఆటగాళ్లు పెవిలియన్​ చేరడం వల్ల కష్టాలు మొదలయ్యాయి. ఆ తర్వాత బరిలో దిగిన సూర్యకుమార్​ యాదవ్​ (36), ఇషాన్​ కిషన్​ (33) పర్వాలేదనిపించారు. కిరన్​ పొలార్డ్​ (41) వరుస బౌండరీలతో స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. మరోవైపు సన్​రైజర్స్​ బౌలర్లు సందీప్​ శర్మ మూడు వికెట్లు పడగొట్టగా.. జేసన్​ హోల్డర్​, షాబాజ్​ నదీమ్​ చెరో రెండు వికెట్లు సాధించి పత్యర్థి స్కోరు రాబట్టకుండా కట్టడి చేశారు. 

20:51 November 03

నెమ్మదించిన మంబయి రన్​రేట్

16 ఓవర్లు పూర్తయ్యే సమయానికి 5 వికెట్లు కోల్పోయిన ముంబయి 109 పరుగులు చేసింది. సందీప్​ శర్మ వేసిన 16.3  బంతికి ​ఇషాన్​ కిషన్​ (33) వెనుదిరిగాడు.

20:31 November 03

సన్​రైజర్స్​ బౌలర్ల ఆధిపత్యం

సన్​రైజర్స్​ బౌలర్ల ధాటికి ముంబయి ఇండియన్స్​ ఆచితూచి బ్యాటింగ్​ చేస్తుంది. 12 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయిన ముంబయి 82 పరుగులు చేసింది. షాబాజ్​ నదీమ్​ ఒక్క ఓవర్​లోనే రెండు వికెట్లను పడగొట్టి ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచాడు. ప్రస్తుతం క్రీజ్​లో ఇషాన్​ కిషన్​ (15), సౌరభ్​ తివారి (1) ఉన్నారు. 

20:12 November 03

ఆచితూచి ఆడుతున్న ముంబయి

రెండు వికెట్లు కోల్పోయిన తర్వాత ముంబయి ఆచితూచి బ్యాటింగ్​ చేస్తోంది. రోహిత్​ సేన 8 ఓవర్లకు 59 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్​లో సూర్యకుమార్​ యాదవ్​ (25), ఇషాన్​ కిషన్​ (5) ఉన్నారు. 

19:52 November 03

ముంబయి బ్యాట్స్​మెన్​పై సందీప్​ శర్మ ప్రతాపం

సన్​రైజర్స్​ బౌలర్ సందీప్​ శర్మ బౌలింగ్​లో ముంబయి రెండు కీలకమైన వికెట్లను సమర్పించుకుంది. 3 ఓవర్​లో కెప్టెన్ రోహిత్​ శర్మ (4) ఔట్​ అవ్వగా.. ఐదు ఓవర్లో డికాక్​(25) వెనుదిరిగాడు. 5 ఓవర్లు పూర్తయ్యే సమయానికి రెండు వికెట్లు నష్టపోయిన ముంబయి 39 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్​లో సూర్యకుమార్​ యాదవ్​ (10), ఇషాన్​ కిషన్​ ఉన్నారు.  

19:00 November 03

టాస్​ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న హైదరాబాద్​

టాస్​ గెలిచిన సన్​రైజర్స్​ హైదరాబాద్​ కెప్టెన్​ డేవిడ్ వార్నర్​ బౌలింగ్​ ఎంచుకున్నాడు.  

జట్లు:

ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ (కెప్టెన్), క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్​), సూర్యకుమార్ యాదవ్, సౌరభ్ తివారి, ఇషాన్ కిషన్, క్రునాల్ పాండ్యా, కిరన్ పొలార్డ్, నాథన్ కౌల్టర్-నైలు, రాహుల్ చాహర్, జేమ్స్ ప్యాటిన్సన్, ధావల్ కులకర్ణి.

సన్‌రైజర్స్ హైదరాబాద్: డేవిడ్ వార్నర్ (కెప్టెన్​), వృద్దిమాన్ సాహా (వికెట్​ కీపర్​), మనీశ్​ పాండే, కేన్ విలియమ్సన్, ప్రియమ్ గార్గ్, జేసన్ హోల్డర్, అబ్దుల్ సమద్, రషీద్ ఖాన్, షాబాజ్ నదీమ్, సందీప్ శర్మ, టి నటరాజన్.

18:37 November 03

ఐపీఎల్​​లో మంగళవారం చివరి లీగ్​ మ్యాచ్​ జరగనుంది. ప్లే-ఆఫ్స్​కు ఇప్పటికే మూడు జట్లు చేరుకోగా ఈ మ్యాచ్​తో నాకౌట్​ దశకు చేరే నాలుగో టీమ్​పై స్పష్టత వస్తుంది. షార్జా వేదికగా సన్​రైజర్స్​ హైదరాబాద్​, ముంబయి ఇండియన్స్​ జట్లు తలపడనున్నాయి. రోహిత్​ సేన ఇప్పటికే క్వాలిఫైయర్​ మ్యాచ్​కు అర్హత సాధించగా.. ప్లే-ఆఫ్స్​లో బెర్త్​ ఖరారు చేసుకునేందుకు వార్నర్​ సేన ప్రణాళికలను రచిస్తోంది. ఈ మ్యాచ్​లో హైదరాబాద్​ గెలిస్తే ఎలిమినేటర్​ పోరుకు అర్హత సాధిస్తుంది. లేదంటే కోల్​కతా నైట్​రైడర్స్​కు ఆ అవకాశం దక్కుతుంది.  

Last Updated : Nov 3, 2020, 11:04 PM IST

ABOUT THE AUTHOR

...view details