తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ సత్తా చాటింది. చెన్నై సూపర్ కింగ్స్ జోరుకు బ్రేకులు వేసింది. హోరాహోరిగా సాగిన పోరులో 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. డుప్లెసిస్ 72(37 బంతుల్లో) చేసిన పోరాటం వృథా అయింది.
ధోని సేనపై రాజస్థాన్ రాయల్స్ విజయం - రాజస్థాన్ vs చెన్నై ప్లేయింగ్ 11
23:26 September 22
23:18 September 22
డుప్లెసిస్ ఔట్
ఆరో వికెట్ కోల్పోయిన చెన్నై. 72 పరుగుల వద్ద ఔట్ అయిన డుప్లెసిస్. ఆరు బంతుల్లో 38 పరుగులు చెన్నై చేయాల్సి ఉంది.
23:09 September 22
డుప్లెసిస్ అర్ధశతకం సాధించాడు. చెన్నై స్కోరు 17 ఓవర్లకు 5 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. 18 బంతుల్లో 58 పరుగులు చేయాల్సి ఉంది.
22:52 September 22
ఐదో వికెట్‌గా వెనుదిరిగాడు కేదార్ జాదవ్(22). చెన్నై ఇంకా 38 బంతుల్లో 103 పరుగులు చేయాల్సి ఉంది.
22:39 September 22
ఇప్పటికే 4 వికెట్లు కోల్పోయిన చెన్నై మరో వికెట్ కోల్పోకుండా నిలకడగా ఆడుతోంది. 13 ఓవర్లు ముగిసేసరికి ధోనీ సేన స్కోరు 108. క్రీజులో జాదవ్(18), డుప్లెసిస్(10) ఉన్నారు.
22:26 September 22
2 బంతుల్లో 2 వికెట్లు..
రాజస్థాన్ బౌలింగ్‌లో చెలరేగిపోతోంది. 77 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది చెన్నై. స్పిన్నర్ తెవాటియా.. వరుస బంతుల్లో సామ్ కరన్, రుతురాజ్ గైక్వాడ్‌లను పెవిలియన్ చేర్చాడు.
22:23 September 22
వచ్చీరాగానే దూకుడుగా ఆడిన కరన్ రెండు సిక్సులతో 5 బంతుల్లో 17 పరుగులు చేసి ఔటయ్యాడు. 8.5 ఓవర్లు పూర్తి చేసుకునేసరికి చెన్నై స్కోరు 77/3.
22:15 September 22
ఓపెనర్లు ఔట్..
రెండో వికెట్‌గా మురళీ విజయ్(21) పెవిలియన్ చేరాడు. శ్రేయస్ గోపాల్ బౌలింగ్‌లో భారీ షాట్ కోసం ప్రయత్నించగా టామ్ కరన్ క్యాచ్ పట్టాడు. 7.3 ఓవర్ల సమయానికి చెన్నై స్కోరు 58/2.
22:06 September 22
చెన్నై సూపర్ కింగ్స్ తొలి వికెట్ కోల్పోయింది. వాట్సన్ 33 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం సీఎస్కే 6.4 ఓవర్లకు ఒక వికెట్ కోల్పోయింది. మురళీ విజయ్ 21 పరుగులతో బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు.
21:59 September 22
చెన్నై సూపర్ కింగ్స్ 5 ఓవర్లలో 36 పరుగులు చేసింది. వాట్సన్ 16, విజయ్ 19 పరుగులతో క్రీజులో ఉన్నారు.
21:48 September 22
రాజస్థాన్ రాయల్స్ విధించిన 217 పరుగుల లక్ష్యాన్నిఛేదించడానికి బరిలో దిగింది చెన్నై. వాట్సన్, విజయ్ ఓపెనర్లుగా వచ్చారు. ప్రస్తుతానికి 3 ఓవర్లకు 19 పరుగులు చేసింది.
21:23 September 22
చెన్నై ముందు భారీ లక్ష్యం
షార్జా వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. ఆఖర్లో వచ్చిన జోఫ్రా ఆర్చర్..ఎంగిడి బౌలింగ్‌లో వరుసగా నాలుగు సిక్సులతో విరుచుకుపడ్డాడు. 8 బంతుల్లోనే 27 పరుగులు చేశాడు. సంజు శాంసన్(74), స్మిత్(69) మినహా మిగిలిన వారంతా విఫలమయ్యారు. చెన్నై బౌలర్లలో సామ్ కరన్ 3 వికెట్లు తీయగా.. చాహర్, ఎంగిడి, చావ్లా ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.
21:06 September 22
రాజస్థాన్ మరో రెండు వికెట్లు కోల్పోయింది. పరాగ్(6) ఔట్ కాగా.. సామ్ కరన్ బౌలింగ్‌లో స్మిత్ 69(47) పెవిలియన్ చేరాడు. 18.2 ఓవర్ల సమయానికి రాజస్థాన్ స్కోరు 178/7.
20:55 September 22
ఐదో వికెట్‌గా తెవాటియా (10) పెవిలియన్ చేరాడు. 16.2 ఓవర్ల సమయానికి రాజస్థాన్ స్కోరు 167/5. క్రీజులో స్మిత్(67), రియాన్ పరాగ్ ఉన్నారు.
20:45 September 22
రాబిన్ ఉతప్ప(5) ఓటయ్యాడు. చావ్లా బౌలింగ్‌లో షాట్‌కోసం ప్రయత్నించగా డుప్లెసిస్ క్యాచ్ పట్టాడు. 15 ఓవర్ల సమయానికి రాజస్థాన్ స్కోరు 154/4.
20:31 September 22
మూడో వికెట్ డౌన్...
శాంసన్ అవుటైన అనంతరం.. క్రీజులోకి వచ్చిన మిల్లర్ ఒక్క బంతి కూడా ఎదుర్కోకుండానే పెవిలియన్ చేరాడు. రనౌట్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం జట్టు స్కోరు 12 ఓవర్లకు 134/3 గా ఉంది.
20:29 September 22
రాజస్థాన్ రెండో వికెట్ కోల్పోయింది. సిక్సర్లతో చెలరేగిపోయిన శాంసన్ 74(32) పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం రాజస్థాన్ స్కోరు 132/2. క్రీజులో స్మిత్, మిల్లర్ ఉన్నారు.
20:21 September 22
బ్యాటింగ్‌లో రాజస్థాన్ దూకుడు పెంచుతోంది. పది ఓవర్లకే 119 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో శాంసన్(66), స్మిత్(45 ) ఉన్నారు.
20:07 September 22
19 బంతుల్లో శాంసన్ అర్ధసెంచరీ..
చెన్నై సూపర్ కింగ్స్‌పై సిక్సర్లతో విరుచుకుపడుతున్నారు సంజు శాంసన్. 19 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇందులో 6 సిక్సర్లు ఉండటం విశేషం.
20:05 September 22
వన్‌డౌన్‌లో వచ్చిన శాంసన్ దూకుడుగా ఆడుతన్నాడు. సిక్సులు, ఫోర్లతో బంతిని బౌండరీలు దాటిస్తున్నాడు. ప్రస్తుతం 14 బంతుల్లో 36 స్కోరుతో చెలరేగిపోతున్నాడు.
19:57 September 22
ఐదు ఓవర్లు పూర్తయ్యేసరికి రాజస్థాన్ స్కోరు 40/1. క్రీజులో స్మిత్( 17), శాంసన్ (16 ) ఉన్నారు.
19:43 September 22
రాజస్థాన్ తొలి వికెట్ కోల్పోయింది. దీపక్ చాహర్ బౌలింగ్‌లో క్యాచ్ అవుట్ అయ్యాడు జైస్వాల్. ఆరు పరుగులు చేసి వెనుదిరిగాడు.
19:34 September 22
తొలి ఓవర్ ముగిసేసరికి వికెట్లేమి నష్టపోకుండా 4 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్. క్రీజులో జైస్వాల్, స్మిత్ ఉన్నారు.
19:29 September 22
తొలి మ్యాచ్ హీరో లేకుండానే..
సీఎస్కే బ్యాట్స్‌మన్, ఫస్ట్ గేమ్ హీరో రాయుడు ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. అతని స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ బరిలోకి దిగుతున్నాడు.
19:23 September 22
'చెన్నై'దే పైచేయి..
ఐపీఎల్లో ఇరు జట్లు ఇప్పటివరకు 21 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. చెన్నై14 మ్యాచ్‌లు నెగ్గగా.. రాజస్థాన్ ఏడింట్లోనే విజయం సాధించింది.
19:10 September 22
జట్ల వివరాలు
చెన్నై సూపర్ కింగ్స్: మురళీ విజయ్, షేన్ వాట్సన్, డుప్లెసిస్, రుతురాజ్ గైక్వాడ్, ధోనీ(కెప్టెన్, వికెట్ కీపర్), కేదార్ జాదవ్, రవీంద్ర జడేజా, సామ్ కరన్, దీపక్ చాహర్, పీయూష్ చావ్లా, లుంగి ఎంగిడి
దిల్లీ క్యాపిటల్స్: యశస్వి జైస్వాల్, రాబిన్ ఊతప్ప, సంజు శాంసన్ (వికెట్ కీపర్), స్టీవ్ స్మిత్ (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రియాన్ పరాగ్, శ్రేయస్ గోపాల్, టామ్ కరన్, రాహుల్ తెవాటియా, జోఫ్రా ఆర్చర్, జయ్‌దేవ్ ఉనద్కత్.
ఉతప్ప, మిల్లర్, టామ్ కరన్, జైశ్వాల్‌లకు రాజస్థాన్ రాయల్స్ క్యాప్ ఇచ్చి టీమ్‌లోకి ఆహ్వానించింది. గత సీజన్లో వీరంతా వేరే ఫ్రాంచైజీల తరఫున ప్రాతినిధ్యం వహించారు.
19:01 September 22
టాస్ నెగ్గిన చెన్నై..
టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించాలని కెప్టెన్ ధోనీ భావిస్తున్నాడు.
18:33 September 22
విజయం ఎవరిది?
షార్జా వేదికగా రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభం. విజయం దక్కించుకోవాలని ఇరుజట్లు పట్టుదలతో ఉన్నాయి.
ఈ ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో నెగ్గిన ధోనీ సేన .. అదే ఊపు కొనసాగించాలని చూస్తోంది. ఎక్కువగా దేశవాళీ ఆటగాళ్లతో ఉన్న.. రాజస్థాన్ కూడా మ్యాచ్ నెగ్గాలన్న పట్టుదలతో బరిలోకి దిగుతోంది.