దుబాయ్‌లో గురువారం రాత్రి జరిగిన క్వాలిఫయర్‌లో ముంబయి ఇండియన్స్ పలు రికార్డులు నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రోహిత్ సేన.. 5 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేయగా, దిల్లీ 143/8కే పరిమితమైంది. దీంతో మొత్తం మీద ఆరోసారి ఫైనల్లో ముంబయి అడుగుపెట్టింది.
దిల్లీతో మ్యాచ్‌లో ముంబయి జట్టు రికార్డులు - IPL
డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి మరోసారి తుదిపోరుకు అర్హత సాధించింది. ఈ క్రమంలో క్వాలిఫయర్‌లో దిల్లీపై గెలిచి పలు ఘనతల్ని సాధించింది.
దిల్లీతో క్వాలిఫయర్‌లో ముంబయి జట్టు రికార్డులు
మ్యాచ్‌లో నమోదైన రికార్డులు
- 201 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో దిల్లీ.. పరుగుల ఖాతా తెరవకుండానే 3 వికెట్లు కోల్పోయింది. తొలి ఓవర్ వేసిన బౌల్ట్.. పృథ్వీషా(0), అజింక్య రహానె(0)లను పెవిలియన్ చేర్చాడు. దీంతో తొలి ఓవర్‌ను డబుల్ వికెట్ మెయిడిన్‌గా నమోదు చేసి రికార్డు సృష్టించాడు. మరోవైపు రెండో ఓవర్ వేసిన బుమ్రా.. ధావన్(0)ను బౌల్డ్ చేశాడు. దీంతో 0 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది దిల్లీ. ఈ లీగ్‌లో ఇలా జరగడం ఇదే తొలిసారి.
- పవర్‌ప్లేల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ముంబయి పేసర్ ట్రెంట్ బౌల్ట్ నిలిచాడు. ఈ సీజన్‌లో మొత్తం 22 వికెట్లు పడగొట్టిన అతడు పవర్‌ప్లేల్లో 14 తీశాడు.
- ఈ లీగ్ చరిత్రలో ముంబయి ఇప్పటివరకు పదిసార్లు మొదట బ్యాటింగ్ చేసి 200కిపైగా పరుగులు సాధించింది. ప్రతిసారి ఆ జట్టు విజయం సాధించడం విశేషం.
- ఈ సీజన్‌లో ముంబయి బ్యాట్స్‌మన్ ఇషాన్ కిషన్ ఇప్పటివరకు అత్యధికంగా 29 సిక్సర్లు బాదాడు. అతడి తర్వాత సంజూ శాంసన్ (26), హార్దిక్ పాండ్య (25) ఉన్నారు. మరోవైపు అత్యధిక సిక్సర్లు బాదిన జట్ల జాబితాలోనూ ముంబయి జట్టే ముందంజలో ఉంది.