తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐపీఎల్: చెన్నై-ముంబయి పోరుకు రికార్డు వ్యూస్​​ - IPL 2020 viewership

కరోనా దెబ్బకు ఐపీఎల్ ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ వ్యూయర్‌షిప్‌లో మాత్రం రికార్డు బ్రేక్ చేసింది. చెన్నై సూపర్ కింగ్స్-ముంబయి ఇండియన్స్ మధ్య జరిగిన ఆరంభ పోరును 20 కోట్ల మంది వీక్షించారు. క్రీడా చరిత్రలో ఓ లీగ్​ ఓపెనింగ్ మ్యాచ్​కు ఇన్ని వీక్షణలు రావడం ఇదే తొలిసారి.

IPL 2020
చెన్నై-ముంబయి

By

Published : Sep 22, 2020, 4:40 PM IST

Updated : Sep 25, 2020, 6:00 PM IST

అందరూ ఊహించినట్లుగానే ఐపీఎల్ 2020 వ్యూయర్‌షిప్‌లో రికార్డు సృష్టించింది. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్, రన్నరప్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన ఆరంభ మ్యాచ్‌కు అదిరిపోయే వ్యూస్ వచ్చాయి. బ్రాడ్ కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బార్క్) లెక్కల ప్రకారం 20 కోట్ల మంది ఈ మ్యాచ్‌ను వీక్షించారు. ప్రపంచంలోనే మరే ఇతర క్రీడా ఈవెంట్​కు‌ ప్రారంభ రోజు ఇంతటి ఆదరాభిమానం దక్కలేదు.

'డ్రీమ్ ఎలెవన్ ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్ సరికొత్త రికార్డు నెలకొల్పింది. బార్క్ లెక్క ప్రకారం తొలి మ్యాచ్‌ను ఎవరూ ఊహించని విధంగా 20 కోట్ల మంది చూశారు. క్రీడా చరిత్రలో ఓపెనింగ్ డేకు ఇన్ని వ్యూస్ రావడం ఇదే తొలిసారి.'

-జైషా, బీసీసీఐ సెక్రటరీ.

కరోనా కారణంగా ఐపీఎల్​ను దుబాయ్​కు తరలించి ఖాళీ స్డేడియాల్లోనే నిర్వహిస్తున్నారు. సెప్టెంబరు 19న జరిగిన ఈ లీగ్​ తొలి మ్యాచ్​లో ​ సీఎస్కే, ముంబయి తలపడగా.. చెన్నై జట్టు 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అంబటి రాయుడు, డుప్లెసిస్ విజయంలో కీలకపాత్ర పోషించారు. నవంబరు 10వరకు ఈ టోర్నీ జరగనుంది.

ఇదీ చూడండి ఆర్సీబీ వరుస ఓటములకు చెక్.. కోహ్లీ అమితానందం!

Last Updated : Sep 25, 2020, 6:00 PM IST

ABOUT THE AUTHOR

...view details