తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆసక్తికరంగా ఐపీఎల్​ రేసు.. ప్లేఆఫ్స్​కు 6 జట్లు పోటీ - ఢిల్లీ క్యాపిటల్స్​ వార్తలు

ఐపీఎల్‌-13 లీగ్‌ దశలో మరో ఆరు మ్యాచ్‌లు మాత్రమే మిగిలున్నాయి. కానీ ప్రస్తుతానికి ముంబయి మాత్రమే ప్లేఆఫ్‌ చేరుకుంది. చెన్నై రేసు నుంచి నిష్క్రమించగా.. మిగిలిన మూడు స్థానాల కోసం ఆరు జట్లు పోటీపడుతున్నాయి. మరి ఈ జట్ల ప్లేఆఫ్‌ అవకాశాలెలా ఉన్నాయో చూద్దాం.

ipl 2020 playoff race becomes quite interesting
ఆసక్తికరంగా ఐపీఎల్​ రేసు.. ప్లేఆఫ్స్​కు ఆరు జట్లు పోటీ

By

Published : Oct 31, 2020, 9:05 AM IST

ఓ దశలో.. 10 మ్యాచ్‌ల్లో 7 విజయాలతో బెంగళూరు, 9 మ్యాచ్‌ల్లో 7 విజయాలతో దిల్లీ క్యాపిటల్స్‌ చెరో 14 పాయింట్లతో తేలికగా ప్లేఆఫ్‌లో అడుగుపెట్టేలా కనిపించాయి. కానీ గత రెండు మ్యాచ్‌ల్లో ఓడిన ఆర్‌సీబీ, వరుసగా మూడు మ్యాచ్‌ల్లో దిల్లీ పరాజయం పాలవడం వల్ల ప్లేఆఫ్‌ బెర్తు ఇంకా ఖరారవ్వలేదు. ఈ జట్లు రెండేసి మ్యాచ్‌ల చొప్పున ఆడనున్నాయి. ఆర్‌సీబీ శనివారం సన్‌రైజర్స్‌పై గెలిస్తే ప్లేఆఫ్‌లో అడుగుపెడుతుంది. మూడో స్థానంలో ఉన్న దిల్లీ తన తర్వాతి మ్యాచ్‌లో ముంబయిని ఓడిస్తే ముందంజ వేస్తుంది. ఈ రెండు మ్యాచ్‌ల్లో ఓడితే దిల్లీ, బెంగళూరు పరస్పరం పోటీపడే తమ చివరి లీగ్‌ మ్యాచ్‌లో గెలిచిన జట్టుకు ప్లేఆఫ్‌ బెర్తు ఖరారవుతుంది. ఓడిన జట్టు నెట్‌రన్‌రేట్‌ను బట్టి ముందంజ వేసే అవకాశముంటుంది.

అంత సులభమేం కాదు..

తొలి ఏడు మ్యాచ్‌ల్లో ఒక్కదాంట్లోనే నెగ్గి.. తర్వాత అయిదు మ్యాచ్‌లు గెలిచి ప్లేఆఫ్‌ దిశగా అడుగులేసిన పంజాబ్‌.. రాజస్థాన్‌ చేతిలో ఓటమితో ఇబ్బందికర పరిస్థితుల్లో పడింది. ఇప్పుడు పంజాబ్‌తో పాటు కోల్‌కతా, రాజస్థాన్‌ తలో 13 మ్యాచ్‌లాడి 12 పాయింట్లతో ఉన్నాయి. పంజాబ్‌ తన చివరి మ్యాచ్‌లో చెన్నైని ఓడిస్తే ప్లేఆఫ్‌ అవకాశాలున్నట్లే. మరోవైపు కేకేఆర్‌, రాజస్థాన్‌ మధ్య పోరులో ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. గెలిచిన జట్టు.. మిగతా మ్యాచ్‌ల ఫలితాలు, నెట్‌ రన్‌రేట్‌ను బట్టి ముందంజ వేస్తుంది.

12 మ్యాచ్‌లాడి 10 పాయింట్లతో ఉన్న సన్‌రైజర్స్‌ తన తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో బెంగళూరు, ముంబయిలతో తలపడనుంది. ప్లేఆఫ్‌ రేసులో ఉన్న మిగతా జట్లతో పోలిస్తే మెరుగైన నెట్‌ రన్‌రేట్‌ ఉన్న సన్‌రైజర్స్‌ ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిస్తే నేరుగా ముందంజ వేసే అవకాశాలున్నాయి.

ABOUT THE AUTHOR

...view details