తెలంగాణ

telangana

ETV Bharat / sports

పంజాబ్​ చిత్తు- 48 పరుగుల తేడాతో ముంబయి గెలుపు - Mumbai Indians won toss

MI slightly hold an edge over their opponents, having won 13 of the 24 games. But looking at a rejuvenated KXIP, another edge-of-the-seat encounter could be in the offing at the spectacular Sheikh Zayed Stadium on Thursday.

IPL 2020: Mumbai, Punjab will aim to recover after losses
ముంబయి-పంజాబ్

By

Published : Oct 1, 2020, 7:03 PM IST

Updated : Oct 1, 2020, 11:27 PM IST

23:22 October 01

ముంబయిదే విజయం..

కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​తో జరిగిన మ్యాచ్​లో 48 పరుగుల తేడాతో ముంబయి విజయం సాధించింది. పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసింది . పంజాబ్​​ బ్యాట్స్​మెన్​ దారుణంగా విఫలమయ్యారు. నికోలస్​ పూరన్​(44) టాప్​ స్కోరర్​. మయాంక్​(25), గౌతమ్​(22) పరుగులు చేశారు. బుమ్రా, చాహర్​, ప్యాటిన్సన్​ తలో రెండు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. 

అంతకుముందు తొలుత బ్యాటింగ్​ చేసిన ముంబయి 20 ఓవర్లకు 191/4 పరుగులు చేసింది. రోహిత్​(70) అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. చివర్లో పొలార్డ్​(47*), హార్దిక్​ పాండ్యా(30) చెలరేగి ఆడారు. షమీ, గౌతమ్​, కాట్రెల్​ తలో వికెట్​ తీశారు. 

22:58 October 01

ఆరో వికెట్ కోల్పోయిన పంజాబ్

ఆరో వికెట్ కోల్పోయింది పంజాబ్. 7 పరుగులు చేసి నీషమ్.. బుమ్రా బౌలింగ్​లో ఔటయ్యాడు.

22:54 October 01

ఐదో వికెట్ కోల్పోయిన పంజాబ్

ఐదో వికెట్ కోల్పోయింది పంజాబ్. 11 పరుగులు చేసిన మ్యాక్స్​వెల్ రాహుల్ చాహర్ బౌలింగ్​లో క్యాచ్ ఔట్​గా వెనుదిరిగాడు. 

22:46 October 01

నాలుగో వికెట్ కోల్పోయిన పంజాబ్

పంజాబ్ నాలుగో వికెట్ కోల్పోయింది. క్రీజులో కుదురుకుంటోన్న నికోలన్ పూరన్​ను (47)ను పెవిలియన్ చేర్చాడు ప్యాటిన్సన్. 

22:29 October 01

పంజాబ్ 11 ఓవర్లకు 87/3

పంజాబ్ 11 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 87 పరుగులు చేసింది. పూరన్ (27) మ్యాక్స్​వెల్ (7) క్రీజులో ఉన్నారు.

22:23 October 01

10 ఓవర్లకు పంజాబ్​ 72/3

పది ఓవర్లు పూర్తయ్యే వరకు 2 వికెట్లు కోల్పోయి పంజాబ్​ 71 పరుగులు చేసింది. మాక్స్​వెల్​ (4), పూరన్​ (21) క్రీజ్​లో ఉన్నారు.

22:16 October 01

కెప్టెన్​ ఇన్నింగ్స్​ను బ్రేక్​ చేసిన రాహుల్ చాహర్​

ముంబయి స్పిన్నర్​ రాహుల్​ చాహర్ బౌలింగ్​లో కింగ్స్​​ ఎలెవన్​ పంజాబ్​ కెప్టెన్​ కేఎల్​ రాహుల్​(17) వెనుదిరిగాడు. 

22:08 October 01

నిలకడగా రాణిస్తున్న పంజాబ్​

ఎనిమిది ఓవర్లు పూర్తయ్యే వరకు 2 వికెట్ల నష్టానికి 60 పరుగులు చేసింది పంజాబ్​. ప్రస్తుతం క్రీజ్​లో బ్యాట్స్​మెన్​ కేఎల్​ రాహుల్​ (17), పూరన్​ (14 )లు నిలకడగా రాణిస్తున్నారు. 

22:04 October 01

రెండో వికెట్​ కోల్పోయిన పంజాబ్​

ముంబయి ఇండియన్స్​ లెగ్​ స్పిన్నర్​ క్రునాల్​ పాండ్యా వేసిన బంతికి కరుణ్​ నాయర్​(0) డకౌట్​గా వెనుదిరిగాడు. ఆరు ఓవర్లు పూర్తయ్యే సరికి పంజాబ్​ 2 వికెట్లు కోల్పోయి 41 పరుగులు చేసింది. క్రీజ్​లో కేఎల్​ రాహుల్​, పూరన్​లు ఉన్నారు.

21:57 October 01

ఓపెనింగ్​ భాగస్వామ్యానికి బుమ్రా బ్రేక్​

కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​ ఓపెనింగ్​ భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. బుమ్రా బౌలింగ్​లో మయాంక్​ అగర్వాల్​(25) పెవీలియన్​ చేరాడు. 

21:49 October 01

జోరుగా ఇన్నింగ్స్ ప్రారంభించిన పంజాబ్

192 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన పంజాబ్ తొలి మూడు ఓవర్లలో 33 పరుగులు చేసింది. ఓపెనర్లు రాహుల్ (9), మయాంక్ అగర్వాల్ (23) క్రీజులో ఉన్నారు.

21:21 October 01

పంజాబ్ లక్ష్యం 192

నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 191 పరుగుల భారీ స్కోర్ చేసింది ముంబయి ఇండియన్స్. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ముంబయికి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్​ డికాక్(0) ​తో పాటు సూర్యకుమార్ యాదవ్ (10) తొందరగానే పెవిలియన్ చేరారు. ఇషాన్ కిషన్ 28 పరుగులతో కాసేపు రోహిత్​కు మద్దతుగా నిలిచాడు. తర్వాత వచ్చిన పొలార్డ్​ 20 బంతుల్లో మూడు ఫోర్లు, నాలుగు సిక్సులతో 47 పరుగులు సాధించాడు. కెప్టెన్ రోహిత్ శర్మ లీగ్​లో 38వ అర్ధశతకం నమోదు చేశాడు. 45 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సులతో 70 పరుగులు చేసి వెనుదిరిగాడు. చివర్లో హార్దిక్ పాండ్యా మెరుపులు మెరిపించాడు. 11 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సులతో 30 పరుగులు చేశాడు.

పంజాబ్ బౌలర్లలో షమీ, కాట్రెల్​, గౌతమ్ చెరో వికెట్ దక్కించుకున్నారు.

21:09 October 01

18 ఓవర్లకు ముంబయి 147/4

18 ఓవర్లు పూర్తయ్యే సరికి ముంబయి ఇండియన్స్ నాలుగు వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా (18), పొలార్డ్ (16) క్రీజులో ఉన్నారు.

20:58 October 01

రోహిత్ శర్మ ఔట్

నాలుగో వికెట్ కోల్పోయింది ముంబయి ఇండియన్స్. భారీ షాట్ ఆడబోయి క్యాచ్​ ఔట్​గా వెనుదిరిగాడు సారథి రోహిత్ శర్మ. దీంతో అతడి 70 పరుగుల ఇన్నింగ్స్​ ముగిసింది.

20:53 October 01

16 ఓవర్లకు ముంబయి 124/3

16 ఓవర్లు పూర్తయ్యే సరికి ముంబయి ఇండియన్స్ మూడు వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (70), పొలార్డ్ (12) క్రీజులో ఉన్నారు.

20:47 October 01

రోహిత్ హాఫ్ సెంచరీ

ముంబయి ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ ఐపీఎల్​లో 38వ అర్ధసెంచరీ నమోదు చేశాడు. ఈ మ్యాచ్​లో 40 బంతుల్లో 53 పరుగులు చేసి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

20:45 October 01

15 ఓవర్లకు ముంబయి 102/3

15 ఓవర్లు పూర్తయ్యే సరికి ముంబయి ఇండియన్స్ మూడు వికెట్ల నష్టానికి 102 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (49), పొలార్డ్ (11) క్రీజులో ఉన్నారు.

20:36 October 01

మూడో వికెట్ కోల్పోయిన ముంబయి

మూడో వికెట్ కోల్పోయింది ముంబయి ఇండియన్స్. 14వ ఓవర్ తొలి బంతికి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు ఇషాన్ కిషన్ (28).

20:35 October 01

13 ఓవర్లకు ముంబయి 83/2

13 ఓవర్లు పూర్తయ్యే సరికి ముంబయి ఇండియన్స్ రెండు వికెట్ల నష్టానికి 83 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (41), ఇషాన్ కిషన్ (28) క్రీజులో ఉన్నారు.

20:21 October 01

10 ఓవర్లకు ముంబయి 62/2

10 ఓవర్లు పూర్తయ్యే సరికి ముంబయి ఇండియన్స్ రెండు వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (36), ఇషాన్ కిషన్ (14) క్రీజులో ఉన్నారు.

20:03 October 01

నిలకడగా ముంబయి బ్యాటింగ్

ఏడు ఓవర్లు పూర్తయ్యే సరికి ముంబయి ఇండియన్స్ రెండు వికెట్ల నష్టానికి 47 పరుగులు చేసింది. రోహిత్ (27), ఇషాన్ కిషన్ (8) క్రీజులో ఉన్నారు.

19:51 October 01

రెండో వికెట్ కోల్పోయిన ముంబయి

ముంబయి ఇండియన్స్ రెండో వికెట్ కోల్పోయింది. సూర్య కుమార్ యాదవ్ 10 పరుగులు చేసి రనౌట్​గా వెనుదిరిగాడు.

19:33 October 01

తొలి వికెట్​గా డికాక్ ఔట్

ఇన్నింగ్స్ ఐదో బంతికే తొలి వికెట్ కోల్పోయింది ముంబయి. ఓపెనర్ డికాక్ పరుగులేమీ చేయకుండానే కాట్రెల్ బౌలింగ్​లో క్లీన్ బౌల్డయ్యాడు.

19:07 October 01

ఇరుజట్లు ఇవే

ముంబయి ఇండియన్స్ పాత జట్టుతోనే బరిలో దిగుతుండగా, పంజాబ్.. మురుగన్ అశ్విన్ స్థానంలో క్రిష్ణప్ప గౌతమ్​కు చోటు కల్పించింది.

ముంబయి ఇండియన్స్

రోహిత్ శర్మ (కెప్టెన్), క్వింటన్ డికాక్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, పొలార్డ్, కృనాల్ పాండ్యా, జేమ్స్ ప్యాటిన్సన్, రాహుల్ చాహర్, బౌల్ట్, బుమ్రా.

కింగ్స్ ఎలెవన్ పంజాబ్

కేఎల్ రాహుల్ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, నికోలస్ పూరన్, మ్యాక్స్​వెల్, కరుణ్ నాయర్, నీషమ్, సర్ఫరాజ్ ఖాన్, క్రిష్ణప్ప గౌతమ్, మహ్మద్ షమీ, కాట్రెల్, రవి బిష్ణోయ్

18:12 October 01

పంజాబ్-ముంబయి మ్యాచ్

ఐపీఎల్​లో అత్యంత ఆకర్షణీయ ఫ్రాంచైజీల్లో ముంబయి ఇండియన్స్​ ఒకటి. ఈ సీజన్​లో ఇప్పటివరకు జరిగిన మూడు మ్యాచ్​ల్లో ఒక్కసారే గెలిచి, అభిమానులను నిరాశపరిచింది. ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన పంజాబ్​.. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచి ఆశలు రేకెత్తిస్తోంది. ఇప్పుడీ రెండు జట్లు, అబుదాబి వేదికగా తలపడుతున్నాయి. ఈ మ్యాచ్​లో మొదట టాస్ గెలిచిన పంజాబ్ ఫీల్డింగ్ ఎంచుకుంది.

ముంబయి గెలుపు బాట పట్టేనా!

చెన్నైతో జరిగిన తొలి మ్యాచ్​లో ఓటమి చవిచూసిన ముంబయి.. ఆ తర్వాత కోల్​కతాపై ఘన విజయం సాధించింది. మూడో మ్యాచ్​లో చివరివరకు పోరాడి.. సూపర్​ ఓవర్​లో బెంగళూరు జట్టుకు తలవంచక తప్పలేదు. కెప్టెన్ రోహిత్​ శర్మ, డికాక్​, ఇషాన్​ కిషన్​, హార్దిక్​ పాండ్యా లాంటి స్టార్​ బ్యాట్స్​మెన్​తో జట్టు బలంగా ఉంది. బౌలింగ్​ విభాగంలో బుమ్రా, బౌల్ట్​, ప్యాటిన్సన్​, రాహుల్ చాహర్​ల అండదండలున్నాయి. మరి పంజాబ్​తో మ్యాచ్​లో రోహిత్​ వ్యూహం ఎలా ఉంటుందో చూడాలి.

పంజాబ్​ రాణిస్తుందా!

సూపర్​ ఓవర్​లో దిల్లీ చేతిలో పరాభవం పొందిన పంజాబ్​.. కెప్టెన్​ కేఎల్​ రాహుల్​ దూకుడైన బ్యాటింగ్​తో రెండో మ్యాచ్​లో బెంగళూరును చిత్తుగా ఓడించింది. రాజస్థాన్​ బ్యాట్స్​మన్​ సంజూ శాంసన్​, తెవాతియా అద్భుత ప్రదర్శనతో మూడో మ్యాచ్​ను చేజార్చుకుంది. జట్టులో కేఎల్​ రాహుల్​, మయాంక్​ అగర్వాల్​, పూరన్​ లాంటి స్టార్​ బ్యాట్స్​మన్​ బలం. మరోవైపు బిష్ణోయ్​, షమీ లాంటి స్టార్ బౌలర్లు ఉన్నారు. ​

Last Updated : Oct 1, 2020, 11:27 PM IST

ABOUT THE AUTHOR

...view details