తెలంగాణ

telangana

చెన్నై ఓపెనర్లు భళా.. పంజాబ్​పై ఘనవిజయం

CSK have undoubtedly dominated the lucrative tournament since its inception in 2008, but the MS Dhoni-led side is struggling this year. Nothing has been going right for CSK: first it was off-field issues, and now they have failed to deliver on the field as well, suffering three defeats on the trot.

By

Published : Oct 4, 2020, 7:02 PM IST

Published : Oct 4, 2020, 7:02 PM IST

Updated : Oct 4, 2020, 11:15 PM IST

ETV Bharat / sports

చెన్నై ఓపెనర్లు భళా.. పంజాబ్​పై ఘనవిజయం

CSK won the toss and elected to bowl
చెన్నై-పంజాబ్

23:07 October 04

వాట్సన్​, డుప్లెసిస్​​ మెరుపు ఇన్నింగ్స్​

కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​పై 10 వికెట్ల తేడాతో చెన్నై సూపర్​కింగ్స్​ ఘనవిజయం సాధించింది. ఓపెనర్లు షేన్​ వాట్సన్​(83), ఫాఫ్​ డు ప్లెసిస్​(87) అద్భుతమైన ఇన్నింగ్స్​తో జట్టుకు గెలుపును అందించారు. 179 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన సీఎస్కే బ్యాట్స్​మెన్ 14 బంతులు మిగిలుండగానే టార్గెట్​ను చేరుకున్నారు. ఓపెనర్లు ఆది నుంచి పంజాబ్​ బౌలర్లపై ఆధిపత్యం చలాయించారు. 

23:00 October 04

17 ఓవర్లకు చెన్నై 168/0

సీఎస్కే ఓపెనర్లు ఆరంభం నుంచి కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​ బౌలర్లపై ఆధిపత్యం కొనసాగిస్తున్నారు. వాట్సన్​(82), డుప్లెసిస్​(75) క్రీజులో ఉన్నారు. పంజాబ్​పై గెలుపు కోసం చెన్నై 18 బంతుల్లో 11 పరుగులు చేయాల్సిఉంది.

22:54 October 04

సీఎస్కే ఓపెనర్ల 150 పరుగుల భాగస్వామ్యం

చెన్నై ఓపెనింగ్​ బ్యాట్స్​మెన్​ 150 పరుగుల భాగస్వమ్యాన్ని నెలకొల్పారు. 16 ఓవర్లు పూర్తయ్యే సరికి సీఎస్కే 156 పరుగులు చేసింది. వాట్సన్​(81), డుప్లెసిస్​(64) క్రీజ్​లో ఉన్నారు. చెన్నై గెలుపు కోసం24 బంతుల్లో 23 పరుగులు చేయాల్సిఉంది.

22:46 October 04

14 ఓవర్లకు చెన్నై 135/0

చెన్నై సూపర్​కింగ్స్​ ఓపెనర్లు కలిసికట్టుగా రాణి్స్తున్నారు. డుప్లెసిస్​ (56), వాట్సన్​(69) ప్రస్తుతం క్రీజ్​లో ఉన్నారు. సీఎస్కే గెలుపు కోసం 36 బంతుల్లో 44 పరుగుల చేయాల్సిఉంది. 

22:31 October 04

12 ఓవర్లకు చెన్నై 119/0

సీఎస్కే ఓపెనర్లు ఆరంభం నుంచి కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​ బౌలర్లపై ఆధిపత్యం కొనసాగిస్తున్నారు. వాట్సన్​(60), డుప్లెసిస్​(51) క్రీజులో ఉన్నారు.

22:28 October 04

వాట్సన్​, డుప్లెసిస్​ హాఫ్​సెంచరీలు

చెన్నై సూపర్​కింగ్స్​ ఓపెనర్లు కలిసికట్టుగా రాణి్స్తున్నారు. డుప్లెసిస్​ (50), వాట్సన్​(55) ప్రస్తుతం క్రీజ్​లో ఉన్నారు. సీఎస్కే గెలుపు కోసం 52 బంతుల్లో 63 పరుగుల చేయాల్సిఉంది. 

22:18 October 04

10 ఓవర్లకు చెన్నై 101/0

పది ఓవర్లలో ఒక్క వికెట్​ కూడా కోల్పోకుండా 101 రన్స్​ చేసింది చెన్నై సూపర్​కింగ్స్​. ఓపెనర్లు షేన్​ వాట్సన్​, డుప్లెసిస్​ బ్యాటింగ్​లో రాణిస్తున్నారు. వీరిద్దరూ కలిసి సీఎస్కే కోసం వంద పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. వాట్సన్​(45), డుప్లెసిస్(49)​ ప్రస్తుతం క్రీజ్​లో ఉన్నారు.  

22:11 October 04

8 ఓవర్లకు చెన్నై 81/0 

బ్యాటింగ్​లో చెన్నై సూపర్​కింగ్స్​ మరింత దూకుడు పెంచి ఆడుతోంది. క్రీజ్​లో వాట్సన్ (32), డుప్లెసిస్ (43) ఉన్నారు. సీఎస్కే గెలుపు కోసం 71 బంతుల్లో 97 పరుగుల చేయాల్సిఉంది. 

21:56 October 04

6 ఓవర్లకు చెన్నై 60/0

చెన్నై సూపర్​కింగ్స్​ బ్యాట్స్​మెన్​ నిలకడగా ఆడుతున్నారు. ప్రస్తుతం క్రీజ్​లో వాట్సన్ (22), డుప్లెసిస్ (32) ఉన్నారు. 

21:44 October 04

నాలుగు ఓవర్లకు చెన్నై 32/0

నాలుగు ఓవర్లలో చెన్నై సూపర్ కింగ్స్ 32 పరుగులు చేసింది. వాట్సన్ (20), డుప్లెసిస్ (7) క్రీజులో ఉన్నారు.

21:32 October 04

రెండు ఓవర్లలో చెన్నై 16/0

179 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన చెన్నై సూపర్ కింగ్స్ తొలి రెండు ఓవర్లలో 16 పరుగులు చేసింది. వాట్సన్ (10), డుప్లెసిస్ (1) క్రీజులో ఉన్నారు.

21:08 October 04

చెన్నై లక్ష్యం 179

చెన్నై సూపర్ కింగ్స్​తో జరుగుతోన్న మ్యాచ్​లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ నాలుగు వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. సారథి కేఎల్ రాహుల్ (63) అద్భుత అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. పూరన్ (33), మయాంక్ (26), మన్​దీప్ సింగ్ (27) పర్వాలేదనిపించారు. చివర్లో సర్ఫరాజ్ (14), మ్యాక్స్​వెల్ (11) చెన్నై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 2, జడేజా, చావ్లా చెరో వికెట్ దక్కించుకున్నారు.

21:06 October 04

19 ఓవర్లకు పంజాబ్ 166/4

19 ఓవర్లకు నాలుగు వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది పంజాబ్. సర్ఫరాజ్ (4), మ్యాక్స్​వెల్ (10) క్రీజులో ఉన్నారు.

20:57 October 04

రాహుల్ ఔట్

నాలుగో వికెట్ కోల్పోయింది పంజాబ్. అద్భుత ఇన్నింగ్స్​తో ఆకట్టుకున్న రాహుల్ 63 పరుగులు చేసి ఔటయ్యాడు.

20:55 October 04

పూరన్ ఔట్

మూడో వికెట్ కోల్పోయింది పంజాబ్. నికోలస్ పూరన్ 33 పరుగులు చేసి ఔటయ్యాడు. ప్రస్తుతం పంజాబ్ 17.1 ఓవర్లకు 152 పరుగులు చేసింది.

20:48 October 04

16 ఓవర్లకు పంజాబ్ 141/2

16 ఓవర్లకు రెండు వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది పంజాబ్. రాహుల్ (63), పూరన్ (22) క్రీజులో ఉన్నారు.

20:40 October 04

రాహుల్ అర్ధశతకం

పంజాబ్ సారథి రాహుల్ లీగ్​లో మరో అర్ధశతకం నమోదు చేశాడు. 46 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం బెంగళూరు 15 ఓవర్లలో 130 పరుగులు చేసింది.

20:28 October 04

13 ఓవర్లకు పంజాబ్ 101/2

13 ఓవర్లు పూర్తయ్యే సరికి పంజాబ్ రెండు వికెట్ల నష్టానికి​ 101 పరుగులు చేసింది. రాహుల్ (30), నికోలస్ పూరన్ (1) క్రీజులో ఉన్నారు.

20:11 October 04

మయాంక్ ఔట్

తొలి వికెట్ కోల్పోయింది  పంజాబ్. 26 పరుగులు చేసిన మయాంక్ అగర్వాల్ క్యాచ్​ ఔట్​గా వెనుదిరిగాడు. ప్రస్తుతం పంజాబ్ 8.1 ఓవర్లలో 61 పరుగులు చేసింది.

19:59 October 04

ఏడు ఓవర్లకు పంజాబ్ 55/0

ఏడు ఓవర్లు పూర్తయ్యే సరికి పంజాబ్​ 55 పరుగులు చేసింది. రాహుల్ (30), మయాంక్ అగర్వాల్ (22) క్రీజులో ఉన్నారు.

19:45 October 04

నాలుగు ఓవర్లకు పంజాబ్ 31/0

నాలుగు ఓవర్లు పూర్తయ్యే సరికి పంజాబ్​ 31 పరుగులు చేసింది. రాహుల్ (21), మయాంక్ అగర్వాల్ (10) క్రీజులో ఉన్నారు.

19:35 October 04

రెండు ఓవర్లకు పంజాబ్ 12/0

రెండు ఓవర్లు పూర్తయ్యే సరికి పంజాబ్​ 10 పరుగులు చేసింది. రాహుల్ (8), మయాంక్ అగర్వాల్ (4) క్రీజులో ఉన్నారు.

19:03 October 04

చెన్నై సూపర్ కింగ్స్ అదే జట్టుతో బరిలో దిగుతుండగా.. పంజాబ్ మూడు మార్పులు చేసింది.

జట్లు

చెన్నై సూపర్ కింగ్స్

షేన్ వాట్సన్, అంబటి రాయుడు, డుప్లెసిస్, ధోనీ (కెప్టెన్), కేదార్ జాదవ్, రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, సామ్ కరన్, శార్దుల్ ఠాకూర్, పీయూష్ చావ్లా, దీపక్ చాహర్

పంజాబ్

కేఎల్ రాహుల్ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, మన్​దీప్ సింగ్, నికోలస్ పూరన్, గ్లెన్ మ్యాక్స్​వెల్, సర్ఫరాజ్ ఖాన్, క్రిస్ జోర్డాన్, హర్​ప్రీత్ బ్రర్, రవి బిష్ణోయ్, మహ్మద్ షమీ, కాట్రెల్

18:41 October 04

చెన్నై-పంజాబ్

ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన చెన్నై సూపర్​కింగ్స్.. ఈసారి ఐపీఎల్​లో అంచనాల్ని అందుకోలేకపోతోంది. ధోనీ సారథ్యంలో స్థాయికి తగినట్లు రాణించలేక వరుసగా మూడు మ్యాచ్​ల్లో ఓడిపోయి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. ఇది ధోనీ అభిమానుల్ని తీవ్రంగా కలచివేస్తున్న అంశం. పంజాబ్​ జట్టుతో జరిగే మ్యాచ్​లోనైనా నెగ్గి, గెలుపు ట్రాక్​లోకి రావాలని భావిస్తోంది సీఎస్కే.

ఈ మ్యాచ్​లో మొదట టాస్ గెలిచిన పంజాబ్ బ్యాటింగ్ ఎంచుకుంది.

Last Updated : Oct 4, 2020, 11:15 PM IST

ABOUT THE AUTHOR

...view details