తెలంగాణ

telangana

ETV Bharat / sports

రాజస్థాన్ vs కోల్​కతా: ప్లేఆఫ్స్​లోకి వచ్చేది ఎవరు? - KKR vs RR live

దుబాయ్ వేదికగా రాజస్థాన్ రాయల్స్- కోల్​కతా నైట్​రైడర్స్ జట్ల మధ్య నేడు మ్యాచ్​ జరగనుంది. రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. ప్లేఆఫ్స్​లో అడుగుపెట్టాలంటే కచ్చితంగా గెలిచి తీరాల్సిన పోరులో ఎవరు విజయం సాధిస్తారో చూడాలి.

IPL 2020, KKR vs RR preview
కోల్​కతా vs రాజస్థాన్

By

Published : Nov 1, 2020, 9:01 AM IST

Updated : Nov 1, 2020, 11:26 AM IST

ఐపీఎల్​ రోజురోజుకూ రసవత్తరంగా మారుతోంది. ప్లేఆఫ్స్​లో స్థానం కోసం జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి. ఈ క్రమంలోనే నేడు (ఆదివారం) రాజస్థాన్ రాయల్స్​-కోల్​కతా నైట్​రైడర్స్ మధ్య మ్యాచ్​ జరగనుంది. ఇందులో గెలిచిన జట్టు 14 పాయింట్లతో ముందడుగు వేస్తుంది. ఇందులో గెలిచిన టీమ్​ టాప్-4లో ఉండాలంటే.. పంజాబ్ తన తర్వాతి మ్యాచ్​లో ఓడిపోవాలి. సన్​రైజర్స్​ కూడా రెండు మ్యాచ్​ల్లో ఏదో ఒకదానిలో ఓటమిపాలవ్వాలి.

రాజస్థాన్​కూ అవకాశాలున్నాయి!

గత రెండు మ్యాచ్​ల్లో గెలిచిన రాజస్థాన్.. ఫుల్​ జోష్​లో ఉంది. ఇదే జోరును కోల్​కతాపైనా కొనసాగించాలని చూస్తోంది. స్టార్ ఆల్​రౌండర్​ స్టోక్స్, సంజూ శాంసన్, కెప్టెన్ స్మిత్, ఉతప్ప అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నారు. రాహుల్ తెవాతియా, రియాన్ పరాగ్.. వీరికి సహకారమందిస్తే సరిపోతుంది. బౌలింగ్​లో ఆర్చర్​, ప్రత్యర్థి బ్యాట్స్​మెన్​ను కట్టడి చేస్తున్నాడు. కానీ మిగిలిన బౌలర్లు కూడా ఇతడితో పాటే రాణిస్తే రాజస్థాన్​ గెలుపు లాంఛనమే!

రాజస్థాన్ రాయల్స్

కోల్​కతా ఓడితే అంతే

12 పాయింట్లతో పట్టికలో ఆరో స్థానంలో ఉన్న కోల్​కతా జట్టు.. రాజస్థాన్​పై​ కచ్చితంగా గెలవాలి. లేదంటే అంతే సంగతులు! జట్టులోని నితీశ్ రానా బ్యాటింగ్​లో రాణిస్తున్నప్పటికీ మిగిలిన బ్యాట్స్​మెన్ విఫలమవుతున్నారు. బౌలర్లలోనూ వరుణ్ స్పిన్​ మాయాజాలంతో ఆకట్టుకుంటున్నా సరే పేస్​ విభాగం ప్రదర్శన నామమాత్రంగానే ఉంది. మరి ఈ మ్యాచ్​లో ఏం చేస్తారో చూడాలి?

కోల్​కతా నైట్​రైడర్స్

జట్లు(అంచనా)

రాజస్థాన్: ఉతప్ప, స్టోక్స్, సంజూ శాంసన్, బట్లర్, స్మిత్ (సారథి), రియాన్ పరాగ్, రాహుల్ తెవాతియా, ఆర్చర్, శ్రేయస్ గోపాల్, అంకిత్ రాజ్‌పుత్, కార్తీక్ త్యాగి

కోల్​కతా: శుభ్​మన్ గిల్, నితీశ్ రానా, రాహుల్ త్రిపాఠి, దినేశ్ కార్తిక్, మోర్గాన్(కెప్టెన్), నరైన్, కమిన్స్, ఫెర్గుసన్, కమలేశ్ నాగర్​కోటి, ప్రసిద్ధ్ కృష్ణ, వరుణ్ చక్రవర్తి

Last Updated : Nov 1, 2020, 11:26 AM IST

ABOUT THE AUTHOR

...view details