దిల్లీ క్యాపిటల్స్ బౌలర్ కగిసో రబాడ ఐపీఎల్లో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. లీగ్‌లో అత్యంత వేగంగా 50 వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. 27 మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించాడు. తర్వాతి స్థానాల్లో సునీల్ నరైన్(32 మ్యాచ్‌లు), మలింగ(33), తాహిర్(35), మెక్లనగన్(36), అమిత్ మిశ్రా(37) ఉన్నారు.
ఐపీఎల్లో ఆ ఘనత సాధించిన తొలి బౌలర్ రబాడ - rabada news
చెన్నైతో మ్యాచ్‌లో దిల్లీ బౌలర్ రబాడ అరుదైన ఘనత సాధించాడు. టోర్నీ చరిత్రలో వేగంగా 50 వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచాడు.
దిల్లీ బౌలర్ రబాడ
దీనితో పాటే 50 వికెట్లు తీసేందుకు తక్కువ బంతులు వేసిన బౌలర్‌గానూ రబాడ నిలిచాడు. ఇందుకోసం కేవలం 616 బంతులే వేశాడు. తర్వాతి స్థానాల్లో మలింగ(749 బంతులు), సునీల్ నరైన్(760), తాహిర్(766), మోహిత్ శర్మ(797)ఉన్నారు.