తెలంగాణ

telangana

ETV Bharat / sports

దిల్లీ జట్టుకు మరో షాక్.. కెప్టెన్ భుజానికి గాయం! - ఐపీఎల్ వార్తలు

దిల్లీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ భుజం నొప్పితో బాధపడుతున్నాడని, ఇప్పుడే ఏం చెప్పలేమని సహచర క్రికెటర్ ధావన్ వెల్లడించాడు.

IPL 2020: Iyer in pain but able to move shoulder, says Dhawan
దిల్లీ జట్టుకు మరో షాక్.. కెప్టెన్ భుజానికి గాయం!

By

Published : Oct 15, 2020, 9:05 AM IST

దిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్​ భుజానికి గాయమైనట్లు తెలుస్తోంది. రాజస్థాన్​తో మ్యాచ్​లో ఐదో ఓవర్​లో బంతిని ఆపే క్రమంలో ఈ దెబ్బ తగిలింది. వెంటనే మైదానాన్ని వీడాడు. అయితే భుజం కదుల్చుతున్నాడని, ఇప్పుడే ఏం చెప్పలేమని సహచర ఆటగాడు శిఖర్ ధావన్ చెప్పాడు. పూర్తి రిపోర్ట్ రావాల్సిందని అన్నాడు.

అంతకు ముందు గాయాల కారణంగానే దిల్లీ బౌలర్లు ఇషాంత్, అమిత్ మిశ్రా.. ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యారు. యువ వికెట్ కీపర్ బ్యాట్స్​మన్ రిషభ్ పంత్​కు తొడ కండరాలు పట్టేయడం వల్ల వారం రోజుల విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపారు.

నొప్పితో మైదానాన్ని వీడిన శ్రేయస్ అయ్యర్

12 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో ఉన్న దిల్లీకి ప్రస్తుతానికి పర్వాలేదు కానీ పంత్, అయ్యర్​ల గాయాలు తగ్గకపోతే రానున్న మ్యాచ్​ల్లో జట్టుకు కష్టాలు ఎదురుకావచ్చు.

రాజస్థాన్​తో బుధవారం జరిగిన మ్యాచ్​లో 13 పరుగుల తేడాతో దిల్లీ క్యాపిటల్స్ గెలుపొందింది. ధావన్ 57, శ్రేయస్ అయ్యర్ 53 పరుగులతో విజయంలో కీలక పాత్ర పోషించారు.

ABOUT THE AUTHOR

...view details