ఐపీఎల్లో దిల్లీ క్యాపిటల్స్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా ఇటీవలే స్పిన్నర్ అమిత్ మిశ్రా టోర్నీ నుంచి తప్పుకోగా.. తాజాగా అదే జట్టుకు చెందిన పేసర్ ఇషాంత్ శర్మ నిష్క్రమిస్తున్నట్లు ఆ జట్టు యాజమాన్యం ప్రకటించింది. ప్రస్తుత సీజన్లో ఇప్పటివరకు ఒక మ్యాచ్ ఆడిన ఇషాంత్.. ఈ నెల 7న ప్రాక్టీసు సెషన్లో గాయపడ్డాడు. ఎడమ పక్కటెముక నొప్పి కలిగిందని.. అది ఇప్పుడు తీవ్రమవ్వడం వల్ల ఇషాంత్ ఐపీఎల్ నుంచి వైదొలగుతున్నట్లు స్పష్టం చేశారు.
దిల్లీకి మరో షాక్.. టోర్నీ నుంచి ఇషాంత్ ఔట్ - ఐపీఎల్ నుంచి వైదొలగిన ఇషాంత్ శర్మ
ఐపీఎల్లో దిల్లీ క్యాపిటల్స్ జట్టును గాయాలు వెంటాడుతున్నాయి. గాయం కారణంగా ఇప్పటికే అమిత్ మిశ్రా టోర్నీ నుంచి నిష్క్రమించగా.. తాజాగా పేసర్ ఇషాంత్ శర్మ వైదొలిగాడు.
మరోవైపు దిల్లీ క్యాపిటల్స్ జట్టు వికెట్ కీపర్ రిషబ్ పంత్ కూడా గాయపడ్డాడు. దీని వల్ల వారం కంటే ఎక్కువ రోజుల పాటు జట్టు మ్యాచ్‌లు ఆడకుండా విశ్రాంతి తీసుకోనున్నట్లు సమాచారం. పంత్ స్థానంలో అలెక్స్ కారీ వికెట్ కీపర్‌గా వ్యవహరించనున్నాడు.
ఐపీఎల్లో వరుస విజయాలతో దిల్లీ జట్టు దూసుకుపోతోంది. ఏడు మ్యాచులాడి ఐదు గెలిచి 10 పాయింట్లు సాధించింది. పాయింట్ల పట్టికలో ప్రస్తుతం రెండో స్థానంలో నిలిచింది. మరో మూడు మ్యాచులు గెలిస్తే 16 పాయింట్లతో ఆ జట్టు ప్లేఆఫ్ బెర్త్ ఖాయం చేసుకుంటుంది.