తెలంగాణ

telangana

ETV Bharat / sports

యూఏఈ చేరుకున్న సన్​రైజర్స్​ ఆటగాడు హోల్డర్ - జాసన్ హోల్డర్ తాజా వార్తలు

గాయం కారణంగా ఐపీఎల్​కు దూరమైన మిచెల్ మార్ష్ స్థానంలో జాసన్ హోల్డర్​ను తీసుకుంది సన్​రైజర్స్ ఫ్రాంచైజీ. ఇతడు ఈరోజు లీగ్​లో పాల్గొనేందుకు యూఏఈ చేరుకున్నాడు. ఆరు రోజుల క్వారంటైన్ ముగిసిన తర్వాత జట్టుతో కలవనున్నాడు.

IPL 2020: Holder arrives in UAE to join SRH squad
యూఏఈ చేరుకున్న హోల్డర్.

By

Published : Sep 26, 2020, 2:14 PM IST

ఐపీఎల్​లో పాల్గొనేందుకు యూఏఈ చేరుకున్నాడు వెస్టిండీస్ సారథి జాసన్ హోల్డర్. బీసీసీఐ నిబంధనల ప్రకారం ప్రస్తుతం ఇతడు ఆరు రోజుల క్వారంటైన్​లో ఉండనున్నాడు. ఈ సమయంలో ఇతడు మూడుసార్లు కరోనా టెస్టు చేయించుకోవాల్సి ఉంటుంది. తర్వాత సన్​రైజర్స్ జట్టుతో కలవనున్నాడు.

ఇటీవలే మిచెల్ మార్ష్ గాయపడటం వల్ల అతడి స్థానంలో హోల్డర్​ను తీసుకుంది సన్​రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ. సోమవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్​లో గాయపడ్డాడు మార్ష్. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల అతడు టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. దీంతో హోల్డర్​కు అవకాశం లభించింది.

హోల్డర్

ఈరోజు సన్​రైజర్స్​.. కోల్​కతా నైట్​రైడర్స్​తో అమీతుమీ తేల్చుకోనుంది. ఇప్పటివరకు ఈ రెండు జట్లు ఆడిన తొలి మ్యాచ్​ల్లో ఓడిపోయాయి. దీంతో లీగ్​లో బోణీ కొట్టేందుకు ఇరుజట్లు ఆత్రుతగా ఎదురుచూస్తున్నాయి.

ABOUT THE AUTHOR

...view details