తెలంగాణ

telangana

ETV Bharat / sports

కోల్​కతా నైట్​రైడర్స్​పై ధోనీసేన ఘనవిజయం - సీఎస్కే స్క్వాడ్ టుడే

IPL 2020: CSK vs KKR match live updates
టాస్​ గెలిచి బౌలింగ్​ ఎంచుకున్న ధోనీసేన

By

Published : Oct 29, 2020, 7:04 PM IST

Updated : Oct 29, 2020, 11:22 PM IST

23:12 October 29

సీఎస్కే ఖాతాలో మరో విజయం

173 లక్ష్యఛేదనతో బరిలో దిగిన చెన్నై సూపర్​కింగ్స్​.. కోల్​కతా నైట్​రైడర్స్​పై 6 వికెట్ల తేడాతో ఘనవిజయాన్ని నమోదు చేసుకుంది. దీంతో టోర్నీలో ఐదో విజయాన్ని ధోనీసేన తమ ఖాతాలో వేసుకుంది. సీఎస్కే ఓపెనింగ్​ బ్యాట్స్​మన్​ రుతురాజ్​ గైక్వాడ్​ (72) హాఫ్​సెంచరీతో అలరించాడు. మరోవైపు కోల్​కతా బౌలర్లు పాట్​ కమ్మిన్స్​, వరుణ్​ చక్రవర్తి చెరో రెండు వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి జట్టు పరుగులు చేయకుండా ఉండటానికి ప్రయత్నించారు. 

22:59 October 29

రుతురాజ్ మెరుపు ఇన్నింగ్స్​కు బ్రేక్​

కోల్​కతా బౌలర్​ పాట్​ కమ్మిన్స్​ వేసిన బంతికి సీఎస్కే ఓపనింగ్​ బ్యాట్స్​మన్​ రుతురాజ్ గైక్వాడ్​ (72) వికెట్​ సమర్పించుకున్నాడు. 18 ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయిన చెన్నై 143 పరుగులు చేసింది.  ఈ మ్యాచ్​లో ధోనీసేన విజయం సాధించాలంటే 12 బంతుల్లో 30 రన్స్​ చేయాల్సిఉంది.

22:42 October 29

రాయుడు, ధోనీ ఔట్​

కోల్​కతా బౌలర్ల ధాటికి చెన్నై సూపర్​కింగ్స్​ బ్యాట్స్​మెన్​ అంబటి రాయుడు (38), ఎంఎస్​ ధోనీ (1) వెనుదిరిగారు. 16 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయిన సీఎస్కే 128 పరుగులు చేసింది. ధోనీసేన గెలుపొందాలంటే 24 బంతుల్లో 45 రన్స్​ చేయాల్సిఉంది. ప్రస్తుతం క్రీజ్​లో రుతురాజ్​ గైక్వాడ్​ (64), సామ్​ కరన్ (5) ఉన్నారు. 

22:25 October 29

రుతురాజ్​ గైక్వాడ్​ హాఫ్​సెంచరీ

చెన్నై సూపర్​కింగ్స్​ ఓపెనర్​ రుతురాజ్​ గైక్వాడ్​ నిలకడగా బ్యాటింగ్​ చేస్తూ.. అర్థశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. 13 ఓవర్లు పూర్తయ్యే సమయానికి ధోనీసేన ఒక వికెట్​ నష్టపోయి 109 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్​లో రుతురాజ్​ గైక్వాడ్​ (59), అంబటి రాయుడు (30) ఉన్నారు. 

21:57 October 29

తొలి వికెట్​...

ధాటిగా ఆడుతోన్న చెన్నై ఓపెనర్​ వాట్సాన్​ ఔటయ్యాడు. రాయుడు, గైక్వాడ్​ ఆడుతున్నారు.

21:43 October 29

ధాటిగా చెన్నై...

చెన్నై ఓపెనర్లు ధాటిగా ఇన్నింగ్స్​ను ఆరంభించారు. వాట్సాన్​, గైక్వాడ్​ ఎడాపెడా బౌండరీలు బాదేస్తున్నారు.

21:11 October 29

చెన్నై లక్ష్యం 173

టాస్​ గెలిచిన చెన్నై సూపర్​కింగ్స్​ జట్టు కోల్​కతాను బ్యాటింగ్​కు ఆహ్వానించింది. తొలుత బ్యాటింగ్​కు దిగిన మోర్గాన్​సేన నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 172 పరుగులు చేసింది. ఓపెనింగ్​ బ్యాట్స్​మన్​ నితీశ్​ రాణా (87) అలరించగా.. శుభ్​మన్​ గిల్​, దినేశ్​ కార్తిక్​ పర్వాలేదనిపించారు. మరోవైపు బౌలింగ్​లో చెన్నై సూపర్​కింగ్స్​ బౌలర్​ లుంగీ ఎన్గిడి రెండు వికెట్లు పడగొట్టగా.. మిచెల్​ శాంటర్న్​, జడేజా, కర్ణ్​ శర్మ చెరో వికెట్​ను సాధించారు. 

20:54 October 29

రాణా మెరుపు ఇన్నింగ్స్​కు బ్రేక్​

ఆది నుంచి దూకుడుగా బ్యాటింగ్​ చేసిన కోల్​కతా ఓపెనింగ్​ బ్యాట్స్​మన్​ నితీశ్​ రాణా (87).. సీఎస్కే బౌలర్​ ఎన్గిడి వేసిన బంతికి సామ్​ కరన్​ క్యాచ్​ ఇచ్చి వెనుదిరిగాడు. 18 ఓవర్లకు కేకేఆర్​ జట్టు నాలుగు వికెట్లు నష్టపోయి 150 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్​లో ఇయాన్​ మోర్గాన్​ (6), దినేశ్​ కార్తిక్​ (12) ఉన్నారు. 

20:25 October 29

నిలకడగా బ్యాటింగ్​ చేస్తున్న కోల్​కతా

దూకుడుగా బ్యాటింగ్​ ప్రారంభించిన కోల్​కతా ఓపెనర్​ శుభ్​మన్​ గిల్​ను కర్ణ్​ శర్మ ఔట్​ చేశాడు. ఆ తర్వాత బరిలో దిగిన సునీల్​ నరైన్​నూ సీఎస్కే బౌలర్లు పెవీలియన్​ చేర్చారు. దీంతో 12 ఓవర్లు పూర్తయ్యే సమయానికి రెండు వికెట్లు నష్టపోయిన మోర్గాన్​సేన 86 పరుగులు చేసింది. 

20:01 October 29

6 ఓవర్లకు కేకేఆర్​ 48/0

కోల్​కతా ఓపెనర్లు శుభ్​మన్​ గిల్​, నితీశ్​ రానా నిలకడగా బ్యాటింగ్​ చేస్తూ.. జట్టు స్కోరుబోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. ఆరు ఓవర్లకు కేకేఆర్​ జట్టు వికెట్​ నష్టపోకుండా 48 రన్స్​ చేసింది. గిల్​ (24), నితీశ్​ రానా (24) క్రీజ్​లో ఉన్నారు. 

19:40 October 29

దూకుడుగా బ్యాటింగ్​ ప్రారంభించిన కేకేఆర్​

కోల్​కతా నైట్​రైడర్స్​ ఓపెనర్​ శుభ్​మన్​ గిల్​ బౌండరీతో ఇన్నింగ్స్​కు శుభారంభాన్నిచ్చాడు. రెండు ఓవర్లు ముగిసే సమయానికి మోర్గాన్​సేన వికెట్​ నష్టపోకుండా 16 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో శుభ్​మన్​ గిల్​ (11), నితీశ్​ రానా (5) ఉన్నారు. 

19:01 October 29

టాస్​ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సీఎస్కే

టాస్​ గెలిచిన చెన్నై సూపర్​కింగ్స్​ కెప్టెన్​ ఎంఎస్​ ధోనీ బౌలింగ్​ ఎంచుకున్నాడు. 

జట్లు:

కోల్‌కతా నైట్ రైడర్స్: శుభ్​మన్​ గిల్, నితీశ్​ రానా, రాహుల్ త్రిపాఠి, దినేశ్​ కార్తిక్ (వికెట్​ కీపర్​), ఇయోన్ మోర్గాన్ (కెప్టెన్​), సునీల్ నరైన్, రింకు సింగ్, పాట్ కమ్మిన్స్, లాకీ ఫెర్గ్యూసన్, కమలేశ్​ నాగర్‌కోటి, వరుణ్ చక్రవర్తి.

చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్, షేన్ వాట్సన్, అంబటి రాయుడు, ఎంఎస్ ధోనీ (కెప్టెన్​, వికెట్​ కీపర్​), ఎన్ జగదీసన్, సామ్ కరన్​, రవీంద్ర జడేజా, మిచెల్ సాంట్నర్, కర్ణ్​ శర్మ, దీపక్ చాహర్, లుంగిసాని ఎన్గిడి.

18:32 October 29

ఐపీఎల్​లో మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. దుబాయి వేదికగా చెన్నై సూపర్​కింగ్స్​ - కోల్​కతా నైట్​రైడర్స్​ మధ్య నేడు మ్యాచ్ జరగనుంది. టోర్నీలో ఇప్పటివరకు 12 మ్యాచ్​లు ఆడిన కోల్​కతా నైట్​రైడర్స్​ 6 నెగ్గి పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో నిలిచింది. ప్రస్తుత ఐపీఎల్​లో 12 మ్యాచ్​లు ఆడిన సీఎస్కే.. నాలుగింటిలో గెలిచి పాయింట్ల పట్టికలో ఆఖరిస్థానంలో ఉంది. ఈ మ్యాచ్​లో గెలుపొంది ప్లేఆఫ్స్​ ఆశలను సజీవం చేసుకోవాలని కేకేఆర్​ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 

Last Updated : Oct 29, 2020, 11:22 PM IST

ABOUT THE AUTHOR

...view details