ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఇప్పటివరకు జరిగిన 22 మ్యాచ్‌ల తర్వాత కూడా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఆరెంజ్ క్యాప్‌పై పట్టు కొనసాగిస్తున్నాడు. మరోవైపు దిల్లీ క్యాపిటల్స్‌కు చెందిన కగిసో రబాడా అద్భుత బౌలింగ్ ప్రదర్శనతో పర్పుల్ క్యాప్‌ను తన వద్దే ఉంచుకున్నాడు.
ఓడినా.. క్యాప్ మీద పట్టు
దుబాయ్ వేదికగా గురువారం సాయంత్రం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌పై 69 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ బౌలర్ల ధాటికి కేఎల్ రాహుల్ కేవలం 11 పరుగులకే వెనుదిరిగాడు. మొత్తం 313 రన్స్ చేసి టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతూ ఆరెంజ్ క్యాప్‌ను కొనసాగిస్తున్నాడు. ఇతని తర్వాత రెండో స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్‌మన్ డుప్లెసిస్ ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో 299 పరుగులు చేశాడు. 281 రన్స్‌తో పంజాబ్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ ఈ జాబితాలో మూడోస్థానంలో ఉన్నాడు.