ఐపీఎల్ 13వ సీజన్ ముగింపు దశకు వచ్చింది. ఇప్పటికే దిల్లీ క్యాపిటల్స్‌పై గెలిచి ఫైనల్ చేరిన ముంబయి ఇండియన్స్.. కప్ కొట్టేందుకు అడుగు దూరంలో ఉంది. అయితే ఓడిన దిల్లీకి మరో అవకాశం ఉంది. ఈరోజు ఎలిమినేటర్‌లో తలపడే బెంగళూరు-హైదరాబాద్ మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో తలపడనుంది. ఇందులో గెలిచిన జట్టు.. తుదిపోరులో ముంబయిని ఢీకొంటుంది.
ఈ మ్యాచ్‌ల్లో గెలివడానికి ఎవరికి వారు ప్రణాళికలు వేస్తుంటే ఆరెంజ్, పర్పుల్ క్యాప్ సాధించేందుకు ఆ జాబితాలో ఉన్నవారు కష్టపడుతున్నారు. ప్రస్తుతానికి ఆరెంజ్ పంజాబ్ కెప్టెన్ రాహుల్ దగ్గర ఉండగా, దిల్లీతో మ్యాచ్ అనంతరం రబాడ నుంచి పర్పుల్ క్యాప్‌ను లాగేసుకున్నాడు ముంబయి బౌలర్ బుమ్రా.
బుమ్రాకు చేరిన పర్పుల్
దిల్లీతో గురువారం జరిగిన క్వాలిఫయర్‌లో ముంబయి బౌలర్ బుమ్రా చెలరేగిపోయాడు. నాలుగు ఓవర్లలో 14 పరుగులే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టి విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇప్పటివరకు 14 మ్యాచ్‌లు ఆడిన బుమ్రా.. 27 వికెట్లు తీశాడు. దిల్లీ బౌలర్ రబాడ 25 వికెట్లతో తర్వాతి స్థానంలో ఉన్నాడు. అలాగే ముంబయి మరో బౌలర్ బౌల్ట్ 22 వికెట్లతో కొనసాగుతున్నాడు.
రాహుల్ వద్దే ఆరెంజ్
పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఆరెంజ్ క్యాప్‌తో కొనసాగుతున్నాడు. ఇతడు 14 మ్యాచ్‌లాడి 670 పరుగులు చేశాడు. అయినా సరే తమ జట్టును ప్లేఆఫ్స్‌కు చేర్చలేకపోయాడు. రాహుల్ తర్వాత స్థానంలో ఉన్న హైదరాబాద్ కెప్టెన్ వార్నర్ 529 పరుగులతో రెండో స్థానంలో, దిల్లీ ఆటగాడు శిఖర్ ధావన్ (525) మూడులో కొనసాగుతున్నారు. వీరి జట్లు ఫైనల్‌కు చేరితే ఆరెంజ్ క్యాప్ దక్కించుకునేందుకు వార్నర్, ధావన్‌కు వీలుంటుంది.