ఐపీఎల్లో బుకీల కలకలం రేగింది. ఆన్లైన్ ద్వారా ఓ ఆటగాడిని బుకీ సంప్రదించినట్లు బీసీసీఐ అవినీతి నిరోధక శాఖ చీఫ్ అజిత్ సింగ్ స్పష్టం చేశారు. దీనిపై దర్యాప్తు వేగవంతం చేసినట్లు తెలిపారు. అవినీతి జరగకుండా నిఘా మరింత పెంచినట్లు వెల్లడించారు.
"ఓ బుకీ తనను సంప్రదించినట్లు ఓ ఆటగాడు మాకు ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం అతడిని ట్రాక్ చేస్తున్నాం. పట్టుకోవడానికి కొంచెం సమయం పడుతుంది. నిఘాను మరింత పటిష్ఠం చేశాం."