రెండు వారాల విరామం తర్వాత తిరిగి ఐపీఎల్ మ్యాచ్ ఆడటం సంతోషంగా ఉందని చెప్పాడు స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ. తొడ కండర గాయం నుంచి కోలుకున్నానని వెల్లడించాడు. అయితే హైదరాబాద్ చేతిలో ఓటమిపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ సీజన్లో ఇదే అసమర్థ ప్రదర్శన అని తెలిపాడు. దీనిని మర్చిపోయి ముందుకు సాగుతామని అన్నాడు.
"జట్టులోకి తిరిగి రావడం సంతోషంగా ఉంది. మరిన్ని మ్యాచ్‌లు ఆడాలనుకుంటున్నాను. చూద్దాం, ఏం జరుగుతుందో. నా తొడ కండరం ప్రస్తుతం బాగుంది. మాకు ఇది గుర్తు పెట్టుకునే రోజు కాదు. ఈ సీజన్లో ఇదే మా అసమర్థ ప్రదర్శన. మేము కొన్ని పద్ధతుల్లో ఆడాలనుకున్నాం. కానీ, అది సరిగా జరగలేదు. బౌలింగ్ చేస్తుంటే మంచు ఇబ్బంది పెట్టింది. ఇదో సరదా ఫార్మాట్. ఏం జరిగిందో మర్చిపోయి భవిష్యత్తుపై దృష్టి పెట్టడం అవసరం. దిల్లీ తరఫున చక్కని ఆటగాళ్లు ఉన్నారు. వాళ్లతో ఆడటం చాలా ఛాలెంజింగ్‌గా ఉంటుంది"
--రోహిత్ శర్మ, ముంబయి ఇండియన్స్ కెప్టెన్