ఈ ఏడాది ఐపీఎల్ తొలి మ్యాచ్‌ను అత్యధికంగా 20 కోట్ల మందికి పైగా వీక్షించారు. అయితే ఈ విషయం తనను ఏ మాత్రం ఆశ్చర్యపరచలేదని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ చెప్పాడు. క్రికెట్‌తో ప్రజల్లో జీవితంలో సాధారణ స్థితి రావాలని బోర్డు ఆశిస్తున్నట్లు పేర్కొన్నాడు.
ఈ ఏడాది మార్చిలో జరగాల్సిన టోర్నీ.. కరోనా ప్రభావంతో దాదాపు ఆరు నెలల ఆలస్యంగా యూఏఈలో ప్రారంభించారు. వైరస్ వ్యాప్తి ఉన్న నేపథ్యంలో స్టేడియంలో ప్రేక్షకులను ఎవరినీ అనుమతించలేదు.
"ఈ విషయం(ఐపీఎల్ వ్యూయర్షిప్) పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు. ప్రజల జీవితాలను, క్రికెట్ ఆటను సాధారణ స్థితికి తీసుకురావడంలో భాగంగా ఐపీఎల్ నిర్వహణకు ముందడుగు వేశాం. ఈ సీజన్ నిర్వహణ కూడా సరిగ్గా చేయగలమా లేదా అనే అనుమానంతోనే ప్రారంభించాం. కానీ బాగానే జరుగుతోంది"
- సౌరభ్ గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు