తెలంగాణ

telangana

ETV Bharat / sports

ధోనీ నిర్ణయంపై స్టార్ స్ప్రింటర్ అసంతృప్తి - dhoni latest news

దిల్లీతో మ్యాచ్​లో జడేజాకు ఆఖరి ఓవరు ఇవ్వడంపై క్రికెట్ అభిమానులే కాకుండా ప్రపంచ స్థాయి స్ప్రింటర్​ బ్లేక్ కూడా అసంతృప్తి వ్యక్తం చేశాడు. అతడికి బదులుగా వాట్సన్​తో బౌలింగ్ చేయించాల్సిందని అభిప్రాయపడ్డాడు.

Dhoni had made the worst decision in a long while, fumes sprinter Yohan Blake
ధోనీ నిర్ణయంపై స్టార్ స్ప్రింటర్ అసంతృప్తి

By

Published : Oct 18, 2020, 12:41 PM IST

ఐపీఎల్​లో చెన్నై కెప్టెన్​ ధోనీ.. చాలా కాలం తర్వాత చెత్త నిర్ణయం తీసుకున్నాడని స్టార్ స్ప్రింటర్ బ్లేక్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఛేదనలో జడేజాకు చివరి ఓవర్​ ఇచ్చిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశాడు. అందుకు సంబంధించిన ఓ వీడియోను ట్వీట్ చేశాడు.

"ధోనీ తీసుకున్న ఈ నిర్ణయం(జడేజాకు ఆఖరి ఓవర్ ఇవ్వడం) చాలా చెత్తది. పూర్ పూర్ పూర్ ఛాయిస్ మహేంద్ర సింగ్ ధోనీ. లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్​మన్ క్రీజులో ఉన్నప్పుడు లెఫ్ట్ హ్యాండ్​ బౌలర్​కు బంతి ఎలా ఇస్తావ్?" -బ్లేక్, స్టార్ స్ప్రింటర్

అయితే చివరి ఓవర్ వేయాల్సిన బ్రావో.. ఫిట్​గా లేని కారణంగా మైదానాన్ని వీడాడు. దీంతో జడేజా, కర్ణ్ శర్మలలో ఎవరి ఎంచుకోవాలి అన్న ప్రశ్న వచ్చినప్పుడు, తాను జడేజా వైపే మొగ్గుచూపానని మ్యాచ్ అనంతరం ధోనీ వివరణ ఇచ్చాడు.

అనంతరం సోషల్ మీడియాలో ఫాలోవర్లతో చర్చించిన బ్లేక్.. బ్రావోకు గాయమైందని తెలుసుకున్నాడు. కానీ జడేజాకు బదులు వాట్సన్​కు బంతి ఇచ్చుండాల్సిందని పేర్కొన్నాడు.

ఇది చదవండి:

ABOUT THE AUTHOR

...view details