అబుదాబి వేదికగా జరిగిన పోరులో దిల్లీ క్యాపిటల్స్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ 59 పరుగులు తేడాతో ఘన విజయం సాధించింది. 195 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన దిల్లీ.. నిర్ణీత 20ఓవర్లలో 135 పరుగులకే ఆల్ఔట్ అయింది. విజయంలో నితీశ్ రానా(81), నరైన్(64) కీలక పాత్ర పోషించారు. దీంతో ప్లే ఆఫ్స్ ఆశల్ని సజీవం చేసుకుంది కోల్‌కతా. రన్‌రేట్‌ను సైతం పెంచుకుంది. దిల్లీ బౌలర్లలో నోర్జే, రబాడా తలో రెండు వికెట్లు తీశారు.
దిల్లీ క్యాపిటల్స్‌పై కోల్‌కతా ఘన విజయం - IPL 2020 news
18:58 October 24
18:51 October 24
16 ఓవర్లకు దిల్లీ ఏడు వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. వరుణ్ చక్రవర్తి ఈ ఓవర్లో 2 వికెట్లు తీసి 2 పరుగులే ఇచ్చాడు. తొలి బంతికి స్టాయినిస్, ఐదో బంతికి అక్షర్ పటేల్ (9)ని ఔట్ చేశాడు. అశ్విన్ (0), రబాడా (1) క్రీజులో ఉన్నారు.
18:45 October 24
దిల్లీ ఆరో వికెట్ చేజార్చుకుంది. వరుణ్ చక్రవర్తి వేసిన 15.1వ బంతికి స్టొయినిస్ (6; 6 బంతుల్లో) ఔటయ్యాడు. రాహుల్ త్రిపాఠి చక్కని క్యాచ్ అందుకున్నాడు.
18:41 October 24
14ఓవర్లు పూర్తయ్యేసరికి దిల్లీ 5 వికెట్లు నష్టానికి 100 పరుగులు చేసింది. క్రీజులో స్టొయినిస్, అక్సర్ పటేల్ ఉన్నారు. విజయానికి 36 బంతుల్లో 95పరుగులు చేయాలి.
18:32 October 24
ఛేదనలో దిల్లీ బ్యాట్స్‌మెన్ తడబడుతున్నారు. దీంతో 13 ఓవర్లు పూర్తయ్యేసరికి 3 వికెట్లు కోల్పోయి 94 పరుగులు మాత్రమే చేసింది. క్రీజులో హెట్మయిర్, శ్రేయస్ అయ్యర్ ఉన్నారు. విజయానికి 42 బంతుల్లో 101 పరుగులు కావాలి.
18:02 October 24
ఛేదనలో ఆచితూచి ఆడుతోంది దిల్లీ జట్టు. ప్రస్తుతం 7 ఓవర్లు పూర్తయ్యేసరికి రెండు వికెట్ల నష్టానికి 44 పరుగులు చేసింది. క్రీజలో పంత్, శ్రేయస్ అయ్యర్ ఉన్నారు. విజయానికి 78 బంతుల్లో 151 పరుగులు కావాలి.
17:36 October 24
నిలకడగా దిల్లీ బ్యాటింగ్
195 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దిల్లీ 2 ఓవర్లు పూర్తయ్యే సరికి 12 పరుగులు చేసింది. అజింక్యా రహానే ఇన్నింగ్స్ మొదటి బంతికే డకౌట్‌గా వెనుదిరిగాడు.
17:15 October 24
దిల్లీ లక్ష్యం 195
దిల్లీతో జరుగుతోన్న మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 194 పరుగుల భారీ స్కోర్ చేసింది. నితీశా రానా (81) అద్భుత ప్రదర్శనతో రాణిించాడు. నరైన్ 64 పరుగులతో ఆకట్టుకున్నాడు.
17:01 October 24
భారీ స్కోర్ దిశగా కోల్‌కతా
దిల్లీతో జరుగుతోన్న మ్యాచ్‌లో కోల్‌కతా మంచి బ్యాటింగ్ తీరు కనబరుస్తోంది. 18 ఓవర్లు పూర్తయ్యే సరికి 4 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. సునీల్ నరైన్ 64 పరుగులతో అద్భుత అర్ధశతకం చేసి రబాడ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. రానా (69)తో కలిసి మోర్గాన్ (5) క్రీజులో ఉన్నాడు.
16:30 October 24
దూకుడుగా కోల్‌కతా బ్యాటింగ్
దిల్లీతో జరుగుతోన్న మ్యాచ్‌లో కోల్‌కతా బ్యాటింగ్‌లో వేగం పెంచింది. ప్రస్తుతం 12 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసింది. నరైన్ (31), రానా (44) దూకుడుగా ఆడుతున్నారు.
16:15 October 24
తడబడుతోన్న కోల్‌కతా
కోల్‌కతా నైట్‌రైడర్స్ 9 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 57 పరుగులు చేసింది. దినేశ్ కార్తీక్ (3), రాహుల్ త్రిపాఠి (13) విఫలమయ్యారు. నితీశ్ రానా, సునీల్ నరైన్ బ్యాటింగ్ కొనసాగిస్తున్నారు.
15:40 October 24
నిలకడగా కోల్‌కతా బ్యాటింగ్
దిల్లీతో జరుగుతోన్న మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేస్తోన్న కోల్‌కతా నైట్‌రైడర్స్ రెండు ఓవర్లకు వికెట్ నష్టానికి 11 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ ప్రారంభంలోనే గిల్ 9 పరుగులు చేసి ఔటయ్యాడు.
15:18 October 24
జట్లు
కోల్‌కతా నైట్‌రైడర్స్
శుభ్‌మన్ గిల్, సునీల్ నరైన్, నితీశ్ రానా, రాహుల్ త్రిపాఠి, ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), దినేశ్ కార్తీక్, కమిన్స్, ఫెర్గుసన్, కమలేశ్ నాగర్కోటి, ప్రసిద్ధ్ కృష్ణ, వరుణ్ చక్రవర్తి
దిల్లీ క్యాపిటల్స్
శిఖర్ ధావన్, అజింక్యా రహానే, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), రిషబ్ పంత్, స్టోయినిస్, హెట్మెయిర్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, రబాడ, తుశార్ దేశ్‌పాండే, ఎన్రిచ్ నోకియా
15:08 October 24
దిల్లీ బౌలింగ్
ఈ ఐపీఎల్ సీజన్లో వరుస విజయాలతో అభిమానుల్ని ఆనందంలో ముంచెత్తుతోంది దిల్లీ క్యాపిటల్స్. కానీ గత మ్యాచ్‌లో పంజాబ్ చేతిలో ఓడిపోయింది. అలానే ఈ సీజన్లో అస్థిర ప్రదర్శనతో అంచనాల్ని అందుకోవడంలో విఫలమవుతోంది కోల్‌కతా నైట్‌రైడర్స్. ప్లే ఆఫ్స్‌కు వెళ్లాలంటే ఇకపై ఆడే ప్రతి మ్యాచ్ తప్పక గెలవాల్సిందే. ఇప్పటికే పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉన్న పైనున్న దిల్లీ.. ఎలాగైనా తొలి నాలుగు స్థానాల్లో నిలవాలని కోల్‌కతా పట్టుదలతో ఉన్నాయి. అలాంటి ఈ రెండు జట్ల మధ్య అబుదాబి వేదికగా నేడు మ్యాచ్ జరుగుతోంది. మొదట టాస్ గెలిచిన దిల్లీ బౌలింగ్ ఎంచుకుంది.