బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియానే ఫేవరెట్ అని పాకిస్థాన్ మాజీ సారథి వసీం అక్రమ్ అన్నాడు. సిరీస్ మొత్తం హోరాహోరీగా సాగుతుందని అంచనా వేశాడు. టీమ్‌ఇండియా పేసర్లు అద్భుతంగా రాణిస్తుండటమే ఇందుకు కారణమన్నాడు.
"ఆస్ట్రేలియా బౌలింగ్ ప్రపంచంలోనే అత్యుత్తమంగా ఉంది. వారికి ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్ సహా టాప్‌క్లాస్ బౌలర్లు ఉన్నారు. అయితే టీమ్ఇండియాలో జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, నవదీప్ సైనీతో పాటు ఇతర బౌలర్లు కూడా బాగానే రాణిస్తున్నారు. మొత్తంగా జట్టులో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతోంది. వారి దేహభాష కూడా మారింది. 1990ల్లో మేం మైదానంలోకి అడుగుపెడుతున్నప్పుడు ఉండే ఆత్మవిశ్వాసం వారిలో కనిపిస్తోంది. వాళ్ల శారీరక భాష వారెంత ఆత్మవిశ్వాసంతో ఉన్నారో చూపిస్తోంది. భారత ఆటగాళ్లు ఏమైనా చేయగలరు. కాబట్టి భారత్-ఆసీస్ పోరు హోరాహోరీగా సాగుతుంది. అయితే ఫేవరెట్ మాత్రం ఆస్ట్రేలియానే."
-వసీం అక్రమ్, పాక్ మాజీ సారథి.