చెన్నై సూపర్ కింగ్స్‌కు మళ్లీ షాక్ తగిలింది. తొలి మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌పై విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన చెన్నై యువ ఆటగాడు అంబటి రాయుడు.. మరో మ్యాచ్‌కు దూరం కానున్నాడు. ఈ విషయాన్ని జట్టు సీఈఓ కాశీ విశ్వనాథన్ తెలిపారు.
దిల్లీ క్యాపిటల్స్‌తో పోరుకు రాయుడు దూరం - rayudu miss another match
గాయం కారణంగా ఇప్పటికే ఓ మ్యాచ్‌కు దూరమైన చెన్నై జట్టు ఆటగాడు అంబటి రాయుడు మరో మ్యాచ్‌కు దూరం కానున్నాడు. సెప్టెంబరు 25న దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగే మ్యాచ్‌కు.. ఈ యువ ప్లేయర్ అందుబాటులో ఉండడు. ఈ విషయాన్ని జట్టు సీఈఓ కాశీ విశ్వనాథన్ తెలిపారు.
రాయుడు
ముంబయి ఇండియన్స్‌తో ఆడిన తొలి మ్యాచులో రాయుడు గాయపడ్డాడు. తొడ కండరాలు పట్టేయడం వల్ల సెప్టెంబరు 22న రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఆడలేదు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. పూర్తి ఫిట్నెస్ సంపాదించుకునే వరకు రాయుడు తర్వాతి మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడని విశ్వనాథన్ వెల్లడించారు. సీఎస్కే సెప్టెంబరు 25న తన తర్వాతి మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది.
ఇదీ చూడండి 'జోఫ్రా అలా రెచ్చిపోతాడని అస్సలు ఊహించలేదు'
Last Updated : Sep 25, 2020, 6:00 PM IST