తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐపీఎల్​ 'పెద్దోడు' సాధించాడు రికార్డులు - ఐపీఎల్​లో పలు రికార్డులు సాధించిన ఇమ్రాన్ తాహిర్

చెన్నై సూపర్ కింగ్స్​కు ప్రాతినిధ్యం వహించిన ఇమ్రాన్ తాహిర్.. ఈ ఐపీఎల్​లో పర్పుల్ క్యాప్​ దక్కించుకుని పలు రికార్డులు సొంతం చేసుకున్నాడు. 40 ఏళ్ల వయసులో ఈ టోర్నీ ఫైనల్ ఆడిన తొలి క్రికెటర్​గా నిలిచాడు.​

ఐపీఎల్​ 'పెద్దోడు' సాధించాడు రికార్డులు

By

Published : May 13, 2019, 9:44 AM IST

ఆదివారం హైదరాబాద్​లో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్​​ ఫైనల్​లో విజేతగా నిలిచింది ముంబయి ఇండియన్స్. గట్టి పోటీ ఇచ్చింది కానీ గెలవలేకపోయింది చెన్నై సూపర్ కింగ్స్. కేవలం ఒక్క పరుగు తేడాతో నాలుగో ఐపీఎల్ టైటిల్​ చేజార్చుకుంది. అయితే సీఎస్​కే జట్టులోని ఇమ్రాన్ తాహిర్ ఈ టోర్నీలో పలు అరుదైన రికార్డులు సాధించాడు.

ఈ సీజన్​లో అత్యధికంగా 26 వికెట్లు తీసిన తాహిర్.. ఎక్కువ వయసులో పర్పుల్ క్యాప్​ సొంతం చేసుకున్న బౌలర్​​గా నిలిచాడు. ఐపీఎల్​లో ఏ సీజన్​ తీసుకున్నా ఓ స్పిన్నర్ ఇన్ని వికెట్లు తీయలేదు. 2012లో 24 వికెట్లు తీసిన నరైన్ ఈ జాబితాలో తర్వాతి స్థానంలో ఉన్నాడు. 40 ఏళ్ల వయసులో ఐపీఎల్​ ఫైనల్​ ఆడిన తొలి క్రికెటర్​గానూ నిలిచాడు ఈ దక్షిణాఫ్రికా ఆటగాడు.

వికెట్ తీసిన ఆనందంలో ఇమ్రాన్ తాహిర్

ప్రస్తుతం ప్రపంచకప్​కు సిద్ధమవుతున్న తాహిర్.. ఈ మెగాటోర్నీ తర్వాత వన్డేల నుంచి రిటైర్మెంట్ తీసుకోనున్నాడు.

ఇది చదవండి: నరాలు తెగే ఉత్కంఠలో.. నాలుగో టైటిల్​ నెగ్గిన ముంబయి

ABOUT THE AUTHOR

...view details