తెలంగాణ

telangana

ETV Bharat / sports

'వచ్చే ఏడాది మళ్లీ వస్తా... సత్తాచాటుతా' - video

హైదరాబాద్​లో జరిగిన ఐపీఎల్​ ఫైనల్​లో తన పోరాట పటిమతో ఆకట్టుకున్న షేన్​ వాట్సన్​ వీడియోను చెన్నై జట్టు సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. తనకు మద్దతుగా నిలిచిన వారందరికీ ఈ వీడియోలో ధన్యవాదాలు తెలిపాడు వాట్సన్​.

వాట్సన్

By

Published : May 16, 2019, 2:17 PM IST

ఐపీఎల్-2019.. ఫైనల్​లో అద్భుతంగా పోరాడి అందరి మనసులను గెల్చుకున్న షేన్ వాట్సన్​ అభిమానులను ఉద్దేశించి పోస్ట్​ చేసిన వీడియోను చెన్నై సూపర్​కింగ్స్​ ట్విట్టర్​లో పంచుకుంది. తనకు మద్దతుగా నిలిచిన వారందరికీ ఈ వీడియోలో ధన్యవాదాలు తెలిపాడు వాట్సన్​. వచ్చే ఏడాది చెన్నై తరపున మళ్లీ ఆడి, సత్తాచాటుతానని చెప్పాడు.

చెన్నై - ముంబయి మధ్య ఆదివారం జరిగిన ఫైనల్​లో వాట్సన్ ఓంటరి పోరాటం చేశాడు. మోకాలికి గాయమైనా.. అర్ధశతకంతో అదరగొట్టాడు. రక్తమొస్తున్నా.. మైదానం వీడకుండా 80 పరుగులతో ఆకట్టుకున్నాడు. వాట్సన్ పోరాట పటిమపై నెటిజన్లు విశేషంగా స్పందించారు.

ఈ మ్యాచ్​లో చెన్నై ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది. ఐపీఎల్ 2019 టైటిల్​ను ముంబయి నాలుగోసారి కైవసం చేసుకుంది. ఇప్పటికి ఎనిమిది సార్లు ఫైనల్​ చేరిన చెన్నై మూడు సార్లు ఛాంపియన్​గా నిలిచింది.

ABOUT THE AUTHOR

...view details