తెలంగాణ

telangana

ETV Bharat / sports

వాట్సన్​ పోరాటపటిమపై నెటిజన్ల ప్రశంసలు - మోకాలు

మోకాలికి గాయమై రక్తాన్ని చిందిస్తూ మైదానంలో వాట్సన్​ పోరాడిన తీరుకు సామాజిక మాధ్యమాల్లో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ముంబయితో జరిగిన ఫైనల్ మ్యాచ్​లో తన పోరాట పటిమతో అందరినీ ఆకట్టుకున్నాడీ చెన్నై ఓపెనర్​.

వాట్సన్

By

Published : May 14, 2019, 1:15 PM IST

సామాజిక మాధ్యమాల్లో షేన్​ వాట్సన్​పై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ముంబయితోఆదివారంజరిగిన ఫైనల్​లో మోకాలికి గాయమైనా.. తన పోరాట పటిమతో అందరినీ ఆకట్టుకున్నాడు. నిజమైన హీరో.. అంకిత భావంతో తమ మనసులు గెల్చుకున్నాడంటూ విశేషంగా స్పందించారు నెటిజన్లు. బాహుబలిలో ప్రభాస్​తో పోల్చుతూ మీమ్స్​ సృష్టించారు. గొప్ప వారియర్​, లెజెండ్​ అంటూ కొనియాడారు అభిమానులు.

ఈ మ్యాచ్​లో 80 పరుగులు చేసిన వాట్సన్.. చెన్నైని గెలిపించేందుకు శాయశక్తులా ప్రయత్నించాడు. మోకాలికి గాయమైనా.. రక్తం చిందిస్తూ చివరివరకు మైదానంలో నిలబడ్డాడు. మ్యాచ్ అనంతరం గాయానికి ఆరు కుట్లు పడ్డాయంటే వాట్సన్​ ఎంత నిబద్ధతతో పోరాడాడో అర్థమవుతోంది. ఈ విషయం వాట్సన్​ ఎవరికీ తెలియనివ్వలేదని చెన్నై బౌలర్ హర్భజన్ సింగ్​ ఇన్​స్టాలో పంచుకున్నాడు.

వాట్సన్​ తర్వాత సీజన్​లోనూ చెన్నై ఓపెనర్​గానే బరిలోకి దిగాలని అభిమానులు కోరుకుంటున్నారు. ముంబయితో జరిగిన ఈ మ్యాచ్​లో చెన్నై ఒక్క పరుగు తేడాతో ఓడి రన్నరప్​గా నిలిచింది.

ABOUT THE AUTHOR

...view details