దిల్లీతో జరిగిన రెండో క్వాలిఫయర్ మ్యాచ్ అనంతరం వాట్సన్ తనకు కృతజ్ఞత తెలిపాడని చెన్నై సూపర్‌కింగ్స్ ఓపెనర్, సౌతాఫ్రికా ప్లేయర్ డుప్లెసిస్ చెప్పాడు. వాట్సన్ కుదురుకునే లోపు తాను వేగంగా పరుగులు రాబట్టడం అతడికి (వాట్సన్) కలిసొచ్చిందని, తర్వాత సులభంగా బ్యాటింగ్ చేశాడని తెలిపాడు.
నేను ఆడితే.. వాట్సన్ కృతజ్ఞత తెలిపాడు..! - faf
తాను వేగంగా పరుగులు చేయడం వాట్సన్‌కు కలిసొచ్చిందని డుప్లెసిస్ చెప్పాడు. మ్యాచ్ అనంతరం వాట్సన్ ఇందుకు కృతజ్ఞత తెలిపాడని సౌతాఫ్రికా ఆటగాడు ఆనందం వ్యక్తం చేశాడు.
"గత కొన్ని మ్యాచ్‌ల్లో మేము స్థాయికి తగ్గట్టుగా ఆడలేకపోయాం. ఈ మ్యాచ్‌లో 3-4 ఓవర్లు పరుగులు చేయకపోయినా.. మేము క్రీజులో నిలబడాలనుకున్నాం. అందుకే వాట్సన్ కుదురుకునేలోపు నేను వేగంగా స్కోరు చేయడానికి ప్రయత్నించా. ఇందుకు తర్వాత వాట్సన్ నా దగ్గరకొచ్చి కృతజ్ఞత తెలిపాడు" -డుప్లెసిస్
దిల్లీతోశుక్రవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వాట్సన్ 6 పరుగులు చేసే సమయానికే డుప్లెసిస్ 42 పరుగుల వద్ద ఉన్నాడు. అనంతరం వాట్సన్ కూడా విజృంభించాడు. ఓపెనర్లిద్దరూ అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. వీరిద్దరూ 10 ఓవర్లలోనే 81 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మే 12న జరిగే ఫైనల్లో ముంబయితో తలపడనుంది చెన్నై సూపర్‌కింగ్స్.