తెలంగాణ

telangana

ETV Bharat / sports

జేబులో ఉంచుకుని మైదానమంతా వెతికారు!

పంజాబ్​ - బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్​లో ఓ విచిత్రం జరిగింది. అంపైర్ బంతిని జేబులో వేసుకుని మర్చిపోయాడు. కాసేపు బంతి కనపడక ఆటగాళ్లందరూ అయోమయంలో పడ్డారు. ఈ ఘటనపై నెటిజన్లు విశేషంగా స్పందిస్తున్నారు.

అంపైర్

By

Published : Apr 25, 2019, 4:49 PM IST

క్రికెట్ మైదానంలో బంతి కనిపించకపోవడం సాధారణమే. కాకపోతే బ్యాట్స్​మెన్ బంతిని స్టేడియం బయటకు కొట్టినపుడు మాత్రమే అలా జరుగుతుంది. కానీ బెంగళూరు - పంజాబ్ మధ్య నిన్న జరిగిన మ్యాచ్​లో బంతి మాయమైంది. ఈ సారి బ్యాట్స్​మెన్​ తప్పిదం కాదు.. అంపైరే బంతిని జేబులో వేసుకుని మర్చిపోయాడు. ఇంకేముంది ఈ ఘటనపై అంతర్జాలంలో మీమ్స్​ షికారు చేస్తున్నాయి.

బెంగళూరు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో పంజాబ్ బౌలర్ మురుగన్ అశ్విన్ 13 ఓవర్ వేసి బంతిని ఫీల్డ్ అంపైర్​ బ్రూస్​కిచ్చాడు. బ్రూస్ ఆ బంతిని మరో అంపైర్ శంషుద్దీన్​కివ్వగా.. అతడు జేబులో వేసుకుని మర్చిపోయాడు. అనంతరం టైమ్​ ఔట్​ ఇచ్చాడు అంపైర్.

14 ఓవర్ వేసేందుకు వచ్చిన అంకిత్ రాజ్​పుత్​ బంతి కోసం వెతకగా... కనపడలేదు. అందరూ వెతుకుతూ అయోమయంలో పడ్డారు. రీప్లేలో అంపైర్ శంషుద్దీన్ జేబులో ఉందని తేలగా అందరూ నవ్వుకోవడం మొదలు పెట్టారు. ప్రస్తుతం ఈ ఘటనపై నెటిజన్లు విశేషంగా స్పదిస్తున్నారు. "బాల్​ ఎక్కడ..? అంపైర్​ జేబులో" అని జోకులు పేల్చుకుంటున్నారు.

ఈ మ్యాచ్​లో పంజాబ్​పై బెంగళూరు 17 పరుగుల తేడాతో గెలిచింది. 203 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. ఆర్​సీబీ బ్యాట్స్​మెన్​ డివిలియర్స్​(82) అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు.

ABOUT THE AUTHOR

...view details