తెలంగాణ

telangana

ETV Bharat / sports

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్​కతా

జయపుర వేదికగా కోల్​కతా నైట్​రైడర్స్​తో తలపడుతోంది రాజస్థాన్​ రాయల్స్. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది కోల్​కతా. ఈ మ్యాచ్​లో జోఫ్రా ఆర్చర్ (రాజస్థాన్) పదునైన బంతులను రసెల్ ఎలా ఎదుర్కుంటాడో వేచి చూడాలి.

By

Published : Apr 7, 2019, 7:40 PM IST

ఐపీఎల్

రాజస్థాన్ రాయల్స్​తో జరుగుతున్న మ్యాచ్​లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది కోల్​కతా. బెంగళూరు మ్యాచ్​లో ఓటమి అంచుల వరకు వెళ్లింది కోల్​కతా. చివర్లో రసెల్ మెరుపులతో మ్యాచ్ నెగ్గింది. ఇప్పటివరకూ ఆడిన మ్యాచ్​లో ఒక్కదాంట్లోనే గెలిచింది రాజస్థాన్. ఈ మ్యాచ్​లో ఎలాగైనా గెలిచి సత్తా చాటాలని భావిస్తోంది. 3 మ్యాచ్​ల్లో గెలిచి జోరు మీదుంది కోల్​కతా.

స్టోక్స్, బట్లర్, రహానే, సంజు శాంసన్​లతో బలంగా ఉంది రాజస్థాన్. బౌలింగ్​లో జోఫ్రా ఆర్చర్, శ్రేయాస్ గోపాల్ ఆకట్టుకుంటున్నారు. కోల్​కతా జట్టులో క్రిస్​లిన్, నితీశ్ రాణా, రాబిన్ ఉతప్ప, రసెల్, దినేశ్ కార్తీక్​లతో బ్యాటింగ్ లైనప్​ బలంగా ఉంది.

కోల్​కతా ఓటమి వరకు చేరినా చివర్లో రసెల్ విధ్వంసం సృష్టించి గెలిపిస్తున్నాడు. మరి ఈ మ్యాచ్​లో జోఫ్రా ఆర్చర్(రాజస్థాన్) పదునైన బంతులను రసెల్ ఎలా ఎదుర్కుంటాడో వేచి చూడాలి.

జట్ల అంచనా..

కోల్​కతా నైట్ రైడర్స్​:

దినేశ్ కార్తిక్(కెప్టెన్), క్రిస్ లిన్, సునీల్ నరైన్, రాబిన్ ఉతప్ప, నితీశ్ రాణా, రసెల్, శుభ్​మన్ గిల్, పియూష్ చావ్లా, కుల్దీప్ యాదవ్, ల్యూక్ ఫెర్గ్యుసన్, ప్రసిధ్ కృష్ణ.

రాజస్థాన్ రాయల్స్​:

అజింక్య రహానే(కెప్టెన్), బట్లర్(కీపర్),స్టీవ్ స్మిత్, రాహుల్ త్రిపాఠి, బెన్ స్టోక్స్, స్టువర్ట్ బిన్ని, కృష్ణప్ప గౌతమ్, జోఫ్రా ఆర్చర్, శ్రేయాస్ గోపాల్, ధవల్ కులకర్ణి.

ABOUT THE AUTHOR

...view details