తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఉత్కంఠ పోరులో.. దిల్లీ థ్రిల్లింగ్​ గెలుపు - కోల్​కతా

కోల్​కతాతో జరిగిన మ్యాచ్​లో దిల్లీ సూపర్​ ఓవర్​ ద్వారా విజయం సాధించింది. సూపర్​ ఓవర్లో దిల్లీ కుర్రాళ్లు అదరగొట్టారు. భీకర బ్యాట్స్​మెన్​ రసెల్​ను బౌల్డ్​ చేసి దిల్లీని రబాడా గెలిపించాడు. ఫృథ్వీషా మ్యాన్​ ఆఫ్​ ది మ్యాచ్​గా నిలిచాడు.

ఉత్కంఠ పోరులో.. దిల్లీ థ్రిల్లింగ్​ గెలుపు

By

Published : Mar 31, 2019, 12:46 AM IST

Updated : Mar 31, 2019, 12:52 AM IST

ఫిరోజ్​షా వేదికగా జరిగిన దిల్లీ- కోల్​కతా మ్యాచ్​ నరాలు తెగే ఉత్కంఠగా సాగింది. కోల్​కతా నిర్దేశించిన 186 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 20 ఓవర్లకు 185 పరుగులే దిల్లీ చేసింది. దీంతో మ్యాచ్​ టైగా ముగిసింది. అనంతరం సూపర్​ ఓవర్లో రబాడా అద్భుత బౌలింగ్​తో దిల్లీ విజయం సాధించింది.


దిల్లీలో మెరిసిన ముంబయి కుర్రాడు

186 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది దిల్లీ క్యాపిటల్స్. ఇన్నింగ్స్​ ప్రారంభించినమూడో ఓవర్​లోనే ధావన్​ వికెట్​ను కోల్పోయింది. మరో ఓపెనర్ పృథ్వీషాతో కలిసిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్.. రెండో వికెట్​కు 89 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. 43 పరుగులు చేసి శ్రేయస్ అయ్యర్ ఔటయ్యాడు.

ఎడాపెడా బాదిన షా..

పృథ్వీ షా

దిల్లీ యువ ఓపెనర్​ ఫృథ్వీషా ఆకాశమే హద్దుగా చెలరేగాడు. బౌలర్​ ఎవరని చూడకుండా ఎడాపెడా షాట్లతో రెచ్చిపోయాడు. కవర్​ డ్రైవ్​లతోక్రికెట్ దిగ్గజం సచిన్​ను తలపించాడు. ఒక్క పరుగు దూరంలో సెంచరీని చేజార్చుకున్నాడు. 55 బంతుల్లో 99 పరుగులు చేసి వెనుదిరిగాడు.

పట్టు బిగించిన కోల్​కతా...

కోల్​కతా

ఫృథ్వీషా ఔట్​ అయిన అనంతరం కోల్​కతా బౌలర్లు పట్టు బిగించారు. వరుస విరామాల్లో వికెట్లు తీసి ఆకట్టుకున్నారు. చివరి ఓవర్లో 6 పరుగులు అవసరం కాగా చైనామన్ బౌలర్​ కుల్​దీప్​ 5 పరుగులే ఇచ్చాడు. దీంతో మ్యాచ్​ ఫలితం కోసం సూపర్​ ఓవర్​కు వెళ్లాల్సి వచ్చింది. ఈ ఐపీఎల్​లో ఇదే మొదటి సూపర్​ ఓవర్​ మ్యాచ్.

'సూపర్​' ఓవర్...

సూపర్​ ఓవర్​లో ముందుగా దిల్లీ బ్యాటింగ్​ చేసింది. శ్రేయస్​ అయ్యర్​, రిషబ్​ పంత్​ బ్యాటింగ్​కు​ వచ్చారు. కృష్టా వేసిన ఈ ఓవర్​లో అయ్యర్​ ఓ ఫోర్​ కొట్టి వెనుదిరిగాడు. మొత్తానికి దిల్లీ 10 పరుగులు చేసింది.

రసెల్​ బౌల్డ్​...

11 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా కోల్​కతా ఛేదిస్తుందనుకున్నారు అభిమానులు. అయితే రబాడా బౌలింగ్​కు వచ్చాడు. దినేశ్​ కార్తీక్​, రసెల్​ ఓపెనర్లుగా దిగారు. మొదటి బంతినే ఫోర్​గా మలిచాడు రసెల్​. తర్వాత ఓ డాట్​ బాల్​ ఆడాడు.

అయితే అద్భుత యార్కర్​తో రసెల్​ను బౌల్డ్​ చేశాడు రబాడా. అభిమానుల అరుపులతో స్టేడియం హోరెత్తింది. మిగిలిన మూడు బంతులకు 3 పరుగులే వచ్చాయి. దీంతో దిల్లీ కుర్రాళ్లు విజయం సాధించారు.

మ్యాన్​ ఆఫ్​ ది మ్యాచ్​గా ఫృథ్వీషా నిలిచాడు.

Last Updated : Mar 31, 2019, 12:52 AM IST

ABOUT THE AUTHOR

...view details