తెలంగాణ

telangana

ETV Bharat / sports

మహిళల తొలి టీ 20 టైటిల్​ సూపర్​నోవాస్​దే..​

జైపుర్ వేదికగా వెలాసిటీతో జరిగిన మహిళల టీ 20 ఫైనల్​ మ్యాచ్​లో సూపర్​నోవాస్​ 4 వికెట్ల తేడాతో గెలిచింది. హర్మన్ అర్ధశతకంతో ఆకట్టుకోగా.. చివర్లో సంయమనంతో ఆడి జట్టును గెలిపించింది రాధ. హర్మన్​కే మ్యాన్​ ఆఫ్​ ద మ్యాచ్​ అవార్డు లభించింది.

సూపర్​నోవాస్

By

Published : May 11, 2019, 11:16 PM IST

మహిళల టీ 20 ఛాలెంజ్ టైటిల్​ను సూపర్​నోవాస్ సొంతం చేసుకుంది. వెలాసిటీతో జరిగిన ఫైనల్​ మ్యాచ్​లో హర్మన్​ సేన 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. జైపుర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్​లో సూపర్​నోవాస్​ కెప్టెన్​ హర్మన్​ ప్రీత్​ కౌర్ (51) అర్ధశతకంతో రెచ్చిపోగా.. చివర్లో మ్యాచ్​ను గెలిపించింది రాధ (10). వెలాసిటీ బౌలర్లలో జహనారా ఆలం రెండు వికెట్లు తీసుకోగా... అమిలీయా, దేవికా చెరో వికెట్ తీసుకున్నారు. విలువైన ఇన్నింగ్స్​ ఆడిన హర్మన్​ ప్రీత్​కే ప్లేయర్​​ ఆఫ్​ ద మ్యాచ్​ అవార్డు దక్కింది.

టాస్​ ఓడి బ్యాటింగ్​కు దిగిన వెలాసిటీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 121 పరుగులు చేసింది. 122 పరుగుల ఛేదనలో సూపర్​నోవాస్ ఆరంభంలోనే చమారీ అటపట్టు వికెట్​ కోల్పోయింది. కాసేపు ప్రియా(29) , రోడ్రిగ్స్​(22) ఇన్నింగ్స్​ను నిలబెట్టినా ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయారు.

64 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన పరిస్థితుల్లో హర్మన్​ విశ్వరూపం చూపించింది. ఆరంభంలో నిదానంగా ఆడినా అనంతరం బ్యాట్​ ఝుళిపించింది. 34 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసి చివరి ఓవర్లో ఔటైంది.

ఆఖర్లో ఉత్కంఠ.. గెలిపించిన రాధ

అమిలీయా కేర్ వేసిన చివరి ఓవర్ మొదటి బంతికి పరుగేమి రాలేదు. రెండో బంతికి కెప్టెన్ హర్మన్ ప్రీత్​ కౌర్ ఔటైంది. మూడో బంతికి రాధ యాదవ్ 2 పరుగులు తీసింది. వరుసగా 4,5 బంతుల్లోనూ రెండు పరుగులు తీసి స్కోరును సమం చేసింది. చివరి బంతిని ఫోర్​గా మలిచి జట్టును గెలిపించింది రాధ.

వెలాసిటీ జట్టులో సుష్మా వర్మ (40), అమిలీయా కేర్ (36) మినహా మిగతా బ్యాట్స్​ఉమెన్ పెద్దగా ఆకట్టుకోలేదు. అమిలీయా బ్యాటింగ్​తో పాటు బౌలింగ్​లోనూ రాణించింది.

ABOUT THE AUTHOR

...view details