మహిళల టీ20 ఛాలెంజ్లో వెలాసిటీతో తలపడుతున్న మ్యాచ్లో సూపర్నోవాస్ 142 పరుగులు చేసింది. జైపూర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో రోడ్రిగ్స్(77) అర్ధశతకంతో అదరగొట్టగా... చమారి అటపట్టు 31 పరుగులతో రాణించింది. వెలాసిటీ బౌలర్లలో అమిలీయా రెండు వికెట్లు తీయగా.. శిఖా పాండే ఓ వికెట్ను తన ఖాతాలో వేసుకుంది.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన సూపర్నోవాస్ ఆరంభంలోనే ప్రియా(16) వికెట్ను కోల్పోయింది. అనంతరం చమారి అటపట్టు - రోడ్రిగ్స్ జోడి నిలకడగా ఆడుతూ జట్టుకు భారీ స్కోరును అందించింది. 31 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అటపట్టు ఔటైనా.. రోడ్రిగ్స్ మాత్రం విజృంభించింది.