తెలంగాణ

telangana

ETV Bharat / sports

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సూపర్ నోవాస్ - హర్మన్​ప్రీత్ కౌర్

ఈ ఏడాది మహిళా టీ20 లీగ్​లో తొలి మ్యాచ్​కు సర్వం సిద్ధమైంది. జైపూర్​లో జరుగుతున్న ఈ పోరులో సూపర్​నోవాస్, ట్రైల్​బ్లేజర్స్ హోరాహోరీగా తలపడనున్నాయి.

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సూపర్ నోవాస్

By

Published : May 6, 2019, 7:25 PM IST

జైపూర్ వేదికగా మహిళా టీ20 ఛాలెంజ్​-2019 ​లో సూపర్ నోవాస్-ట్రైల్​బ్లేజర్స్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన సూపర్​ నోవాస్ సారధి హర్మన్ ప్రీత్ బౌలింగ్ ఎంచుకుంది. ట్రైల్​ బ్లేజర్స్​కు స్మృతి మంధాన కెప్టెన్​గా వ్యవహరిస్తోంది.

ఈ సీజన్​లో ఈ రెండింటితో పాటు వెలాసిటీ అనే మరో జట్టుకు పోటీలో ఉంది. ఈ జట్టుకు మిథాలీరాజ్ నాయకత్వం వహిస్తోంది. మూడు జట్ల మధ్య నాలుగు మ్యాచ్​లు జరగనున్నాయి. టాప్-2లో నిలిచిన టీమ్​లు ఫైనల్​లో తలపడతాయి.

జట్లు

:-

సూపర్​నోవాస్
హర్మన్ ప్రీత్(కెప్టెన్), డివైన్, ఆటపట్టు, జెమీమా రోడ్రిగ్జ్, స్కీవర్, ప్రియా పూనియా, తానియా భాటియా, అనూజ పాటిల్, రాధా యాదవ్, తాహుహు, పూనమ్ యాదవ్

ట్రైల్​బ్లేజర్స్
స్మృతి మంధాన(కెప్టెన్),సుజీ బేట్స్, హర్లీన డియోల్, దయాలన్ హేమలత, , స్టెఫానీ టేలర్, జులాన్ గోస్వామి, ఆర్.కల్పన (వికెట్ కీపర్), రాజేశ్వరి గైక్వాడ్, షకీరా షెల్మాన్, సోఫీ ఎక్స్​ల్ స్టోన్

ABOUT THE AUTHOR

...view details