తెలంగాణ

telangana

ETV Bharat / sports

చెలరేగిన 'రైజర్స్'​ బౌలర్లు... లక్ష్యం 130 - శ్రేయాస్​ అయ్యర్

టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన దిల్లీ క్యాపిటల్స్​ నిర్ణీత 20 ఓవర్లలో 129 పరుగులకే పరిమితమైంది. శ్రేయస్​ అయ్యర్​ ఒక్కడే 43 పరుగులతో ఆకట్టుకున్నాడు.

తక్కువకే దిల్లీ కట్టడి..సన్​రైజర్స్​​ లక్ష్యం 130

By

Published : Apr 4, 2019, 9:58 PM IST

ఫిరోజ్​ షా కోట్లా వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌, దిల్లీ క్యాపిటల్స్​ మధ్య జరుగుతున్న మ్యాచ్​లో....మొదట బ్యాటింగ్​ చేసిన దిల్లీ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 129 పరుగులకు పరిమితమైంది.

  • వరుస కట్టేశారు...

రెండు ఫోర్లు కొట్టి మంచి ఆరంభాన్నిచ్చిన పృథ్వీషా 11 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద భువనేశ్వర్​ బౌలింగ్​లో బౌల్డ్​ అయ్యాడు. వెంటనే శిఖర్​ ధావన్​(12), పంత్​(5), రాహుల్​ తెవాటియా(5), ఇంగ్రామ్​ (5), మోరిస్​ (17) తక్కువ పరుగులకే ఔట్​ కావడంతో స్కోరు మందగించింది. చివర్లో అక్షర్​ పటేల్​ 17 పరుగులు చేయడంతో లక్ష్యం కొంచెం పెరిగింది.

  • ఆ మాత్రం శ్రేయస్​ వల్లే..

తొలుత బ్యాటింగ్​కు దిగిన దిల్లీ జట్టు హైదరాబాద్ బౌలింగ్​ ముంగిట తలవంచింది. మంచి బ్యాటింగ్​ లైనప్​గా భావించే దిల్లీ క్యాపిటల్స్​ శ్రేయస్​ 41 బంతుల్లో 43 పరుగులు చేయడంతో ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది.

హైదరాబాద్​ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్​ చేశారు. భువనేశ్వర్​, నబీ, కౌల్​ తలో రెండేసి వికెట్లు తీశారు. రషీద్​ ఖాన్​, సందీప్​ చెరో వికెట్ తీశారు. రషీద్​ ఖాన్​ 4 ఓవర్లకు 18 పరుగులు మాత్రమే ఇచ్చి పొదుపుగా బౌలింగ్​ చేశాడు.

ABOUT THE AUTHOR

...view details