తెలంగాణ

telangana

ETV Bharat / sports

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్​రైజర్స్​ - క్యాపిటల్స్

దిల్లీతో జరుగుతున్న మ్యాచ్​లో హైదరాబాద్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దిల్లీని వాళ్ల మైదానంలోనే ఓడించిన సన్​రైజర్స్ సొంతగడ్డపై మరోసారి సత్తా చాటాలనుకుంటుంది.

హైదరాబాద్

By

Published : Apr 14, 2019, 7:51 PM IST

దిల్లీ క్యాపిటల్స్​తో తలపడుతున్న మ్యాచ్​లో సన్​రైజర్స్​ హైదరాబాద్​ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఉప్పల్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్​లో కేన్ విలియమ్సన్​ జట్టు పగ్గాలు చేపట్టాడు. ఇప్పటికే దిల్లీతో జరిగిన మ్యాచ్​లో హైదరాబాద్​ గెలిచింది. ప్రస్తుతం సొంతగడ్డపై జరగనుండటం.. రైజర్స్​కు కలిసొచ్చే అంశం.సన్​రైజర్స్​కు ఇది వందో ఐపీఎల్ మ్యాచ్​.

ముంబయితో జరిగిన మ్యాచ్​లో హైదరాబాద్ 97 పరుగులకే కుప్పకూలింది. స్లో పిచ్​పై సన్​రైజర్స్ బ్యాట్స్​మెన్ ఆడేందుకు ఇబ్బంది పడ్డారు. నేడు కూడా అలాగే పిచ్​ బౌలింగ్​కు సహకరించనుంది.

కోల్​కతాపై విజయం సాధించి జోరు మీదుంది దిల్లీ. శిఖర్ ధావన్ 97 పరుగులతో అదరగొట్టాడు. మరోసారి గబ్బర్ బ్యాట్​ ఝళిపించాలని అభిమానులు ఆశిస్తున్నారు. గత రెండు మ్యాచ్​ల్లోనూ ఓటమి చవిచూసిన సన్​రైజర్స్ ఈ మ్యాచ్​ ఎలాగైనా గెలవాలనే కసితో బరిలో దిగుతుంది. వార్నర్, బెయిర్​ స్టోలు మరోసారి హైదరాబాద్​కు కీలకం కానున్నారు.

ఈ మ్యాచ్​లో మార్పులు:

హైదరాబాద్ జట్టులో నబీ స్థానలో కేన్ విలియమ్సన్ రాగా... మనీశ్ పాండే, యూసుఫ్ పఠాన్, కౌల్ స్థానంలో రికీ భూయ్, అభిషేక్ శర్మ, ఖలీల్ అహ్మద్ వచ్చారు. దిల్లీలో కొలిన్ మున్రో, అమిత్ మిశ్రా ఆడనున్నారు.

జట్లు

సన్​రైజర్స్ హైదరాబాద్:

కేన్​ విలియమ్సన్(కెప్టెన్​), రికీ భూయ్, డేవిడ్ వార్నర్​, దీపక్ హుడా, ​భువనేశ్వర్ కుమార్ , అభిషేక్ శర్మ​, విజయ్ శంకర్​, బెయిర్​స్టో, ఖలీల్ అహ్మద్, రషీద్ ఖాన్, సందీప్ శర్మ

దిల్లీ క్యాపిటల్స్:

శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), పృథ్వీషా, పంత్, ధావన్, ఇషాంత్, రబాడా, అక్షర్ పటేల్, క్రిస్ మోరిస్, కీమో పాల్, కొలిన్ మున్రో, అమిత్ మిశ్రా

ABOUT THE AUTHOR

...view details