తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఫ్లే ఆఫ్స్​లో సన్​రైజర్స్ అడుగు పెడుతుందా..? - ఐపీఎల్ 2019

ఫ్లేఆఫ్​ చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్​లో బెంగళూరుతో తలపడనుంది హైదరాబాద్. చిన్న స్వామి స్టేడియంలో జరిగే ఈ పోరు సాయంత్రం 8 గంటలకు ప్రారంభం కానుంది.

ఫ్లే ఆఫ్స్​లో సన్​రైజర్స్ అడుగు పెడుతుందా..?

By

Published : May 4, 2019, 7:30 AM IST

లీగ్​ దశలో తన చివరి మ్యాచ్​ ఆడేందుకు హైదరాబాద్​ జట్టు సిద్ధమైంది. ఫ్లే ఆఫ్స్​కు చేరాలంటే తప్పక గెలవాల్సిన పోరులో బెంగళూరుతో తలపడనుంది. మరి విలియమ్సన్ నేతృత్వంలోని రైజర్స్ గెలిచి నిలుస్తుందా లేదా అని చూడాల్సిందే.

ముంబయితో వాంఖడేలో జరిగిన పోరులో సూపర్ ఓవర్​ వరకు వెళ్లిన హైదరాబాద్​.. మ్యాచ్​ను చేజార్చుకుంది. ఇప్పుడు ఆర్​సీబీపై ఎలాగైనా సరే గెలిచి ఫ్లేఆఫ్స్​లో చోటు దక్కించుకోవాలని భావిస్తోంది. ప్రస్తుతం రైజర్స్ రన్​రేట్ +0.653 ఉండటం కలిసొచ్చే అంశం.

ఒకవేళ రైజర్స్ తన చివరి లీగ్​ మ్యాచ్​లో ఓడినా ఫ్లేఆఫ్స్​కు అర్హత సాధించే అవకాశముంది. తమ చివరి లీగ్​ మ్యాచుల్లో పంజాబ్, కోల్​కతా జట్లు ఓడిపోతే ఇది సాధ్యమవుతుంది.

వార్నర్, బెయిర్​స్టో.. వారి స్వదేశానికి వెళ్లిపోవడంతో జట్టును కొంతమేర ఒత్తిడికి గురి చేసింది. వారు లేని లోటును మనీశ్ పాండే తీర్చాడు. గత మ్యాచ్​లో ఒంటరి పోరాటం చేసి 71 పరుగులతో ఆకట్టుకున్నాడు. కానీ మ్యాచ్​ను గెలిపించలేకపోయాడు.

మిగతా బ్యాట్స్​మెన్​లో విలియమ్సన్, విజయ్ శంకర్, సాహా.. ఈ మ్యాచ్​లోనైనా బ్యాటు ఝుళిపించాల్సిన అవసరం ఉంది.
రైజర్స్ బౌలర్లు రాణిస్తే హైదరాబాద్ విజయాన్ని అడ్డుకోవడం కష్టమే. బెంగళూరు మేటి టాప్ ఆర్డర్​ను వారు ఎలా నిలువరిస్తారు అనేది ప్రశ్న.

భువనేశ్వర్, ఖలీల్, రషీద్ ఖాన్, సందీప్ శర్మ.. అమ్ముల పొదిలోని అస్త్రాలను బయటకు తీయాల్సిందే.

ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించిన బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్.. ఈ మ్యాచ్​లో ఎలా ఆడుతుందా అనేది చూడాలి.

జట్లు (అంచనా)

హైదరాబాద్ సన్​ రైజర్స్​
విలియమ్సన్​(కెప్టెన్​), మనీశ్ పాండే, మార్టిన్ గప్తిల్​, మొహమ్మద్ నబీ, విజయ్ శంకర్​, వృద్ధిమాన్ సాహా, సిద్ధార్థ్ కౌల్, ఖలీల్ అహ్మద్, భువనేశ్వర్ కుమార్, రషీద్ ఖాన్, బసీల్ థంపీ

బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్
విరాట్​ కోహ్లీ (కెప్టెన్), పార్థివ్ పటేల్, డివిలియర్స్, ఉమేశ్ యాదవ్, చాహల్, పవన్ నేగి, గుర్​కీరత్ సింగ్ మన్, స్టాయినిస్, నవదీప్ సైనీ, క్లాసిన్, కుల్వంత్


For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details