దక్షిణాఫ్రికా పేస్ బౌలర్ బ్యూరెన్ హెండ్రిక్స్ త్వరలో ముంబయి జట్టులో భాగం కానున్నాడు. అరంగేట్రంలోనే అదరగొట్టినా... గాయం కారణంగా ఆటకు దూరమైన అల్జారీ జోసెఫ్ స్థానంలో ఇతడికి అవకాశం లభించింది. 64 టీ20ల్లో ఆడిన ఈ సఫారీ ఫాస్ట్ బౌలర్ హెండ్రిక్స్ 89 వికెట్లు పడగొట్టాడు. రెండు వన్డేలు, 10 టీ20ల్లో దక్షిణాఫ్రికా తరఫున ప్రాతినిధ్యం వహించాడు. గతంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టులో ఉన్నా తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు.
'ముంబయి'లోకి దక్షిణాఫ్రికా పేసర్ హెండ్రిక్స్ - అల్జారీ జోసెఫ్
ముంబయి ఇండియన్స్ జట్టులోకి దక్షిణాఫ్రికాకు చెందిన ఎడమ చేతి వాటం పేసర్ బ్యూరెన్ హెండ్రిక్స్ రానున్నాడు. గాయంతో సిరీస్‌కు దూరమైన అల్జారీ జెసెఫ్ బదులుగా ఇతడిని ఎంపిక చేసింది ముంబయి జట్టు యాజమాన్యం.
ముంబయి జట్టులోకి దక్షిణాఫ్రికా పేసర్ హెండ్రిక్స్
ఆడమ్ మిల్నే దూరం కావడం వల్ల జట్టులోకి వచ్చిన వెస్టిండీస్ ఆటగాడు అల్జారీ జోసెఫ్... ఏప్రిల్ 13న రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో గాయపడ్డాడు. ఫలితంగా పూర్తి సీజన్‌కు దూరమయ్యాడు. అరంగేట్రంలోనే టీ20లలో 6 వికెట్లు తీసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు జోసెఫ్. ఏప్రిల్ 26న చెన్నై సూపర్‌కింగ్స్‌తో బరిలోకి దిగనుంది ముంబయి ఇండియన్స్ జట్టు.