తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆ రికార్డు సాధించిన తొలి క్రికెటర్ ధావన్ - విరాట్ కోహ్లి

ఐపీఎల్​లో క్రికెటర్ శిఖర్ ధావన్ ఓ రికార్డు సాధించాడు. ఈ టోర్నీలోనే 500 ఫోర్లు కొట్టిన తొలి బ్యాట్స్​మెన్​గా నిలిచాడు.

ఆ రికార్డు సాధించిన తొలి క్రికెటర్ ధావన్

By

Published : Apr 21, 2019, 12:38 PM IST

ఐపీఎల్​ అంటే అందరూ సిక్సర్లు గురించే ఆలోచిస్తారు. కానీ ఫోర్లు కొట్టి రికార్డు సాధించొచ్చని ఓ బ్యాట్స్​మన్ నిరూపించాడు. శనివారం పంజాబ్​తో జరిగిన మ్యాచ్​​లో శిఖర్ ధావన్ ఓ రికార్డు సాధించాడు. ఈ టోర్నీలో 500 ఫోర్లు కొట్టిన తొలి క్రికెటర్​గా నిలిచాడు. ప్రస్తుతం ఈ సీజన్​లో దిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్​గా రాణిస్తున్నాడు. ఇప్పటివరకు ఐపీఎల్​లో 153 మ్యాచ్​లు ఆడాడీ క్రికెటర్. ఆ జాబితాలో 491 ఫోర్లతో రెండో స్థానంలో ఉన్నాడు గౌతమ్ గంభీర్.

అత్యధిక ఫోర్లు కొట్టిన వారిలో తొలి పది మంది

1 శిఖర్ ధావన్ 502 ఫోర్లు
2 గౌతమ్ గంభీర్ 491
3 సురేశ్ రైనా 473
4 విరాట్ కోహ్లీ 471
5 డేవిడ్ వార్నర్ 445
6 రాబిన్ ఉతప్ప 432
7 రోహిత్ శర్మ 407
8 అజింక్య రహానే 384
9 క్రిస్ గేల్ 360
10 ఏబీ డివిలియర్స్ 349

ABOUT THE AUTHOR

...view details