తెలంగాణ

telangana

ETV Bharat / sports

రైజర్స్​తో రాయల్స్​ పోరు.. కీలక ఆటగాళ్ల లేమి

నేటి ఐపీఎల్​ మ్యాచ్​లో రాజస్థాన్-హైదరాబాద్​ జట్లు హోరాహోరీగా తలపడనున్నాయి. ఇరుజట్లలోని ఇంగ్లండ్​ ఆటగాళ్లు వారి స్వదేశానికి వెళ్లిపోయారు. ఆ జాబితాలో బట్లర్, జోప్రా ఆర్చర్, స్టోక్స్, బెయిర్​ స్టో ఉన్నారు.

కీలక ఆటగాళ్లు లేని తొలి ఐపీఎల్​ మ్యాచ్​

By

Published : Apr 27, 2019, 8:00 AM IST

జైపూర్​ వేదికగా సన్​రైజర్స్​ హైదరాబాద్​తో రాజస్థాన్ రాయల్స్ నేడు తలపడనుంది. ఇరుజట్లలోని స్టార్ ఆటగాళ్లు కొంత మంది ఈ రోజు మ్యాచ్​లో కనిపించరు.

ప్రస్తుత పరిస్థితుల్లో ఇంగ్లండ్​ స్టార్ ఆటగాళ్లు లేకపోవడం రాజస్థాన్​పై ఎక్కువ ప్రభావం చూపనుంది. జట్టులోని కీలక ఆటగాళ్లయిన స్టోక్స్, బట్లర్, జోప్రా ఆర్చర్ సేవల్ని రాయల్స్ కోల్పోయింది. ప్రపంచకప్​ సన్నాహకాల్లో భాగంగా వీరు ఇంగ్లండ్​కు పయనమయ్యారు.

సన్​రైజర్స్ జట్టులో వార్నర్​తో కలిసి విధ్వంసక ఓపెనింగ్ చేస్తున్న బెయిర్​స్టో స్వదేశానికి వెళ్లిపోయాడు. ఇరుజట్లలోని ఆసీస్ ఆటగాళ్లు వార్నర్, స్మిత్ వచ్చే వారం వరకే ఐపీఎల్​లో కనిపిస్తారు.

ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రైజర్స్.. నాలుగో స్థానంలో ఉంది. రాజస్థాన్ ఏడో స్థానంలో ఉంది. ఈ రోజు మ్యాచ్​లో విజయం రెండు జట్లకు ఎంతో అవసరం.

రాజస్థాన్ రాయల్స్..​ ఆర్చర్​ సేవల్ని కోల్పోవడం కొంత మేర లోటే. మరోవైపు యువ సంచలనం రియాన్ పరాగ్ ఫామ్​లో ఉండటం కలిసొచ్చే అంశం. మిగతా బ్యాట్స్​మెన్​లో రహానే, స్మిత్, సంజూ శాంసన్, త్రిపాఠి చెలరేగితో గెలుపు కష్టమేమి కాదు.

బౌలర్లలో వరుణ్ ఆరోన్, థామస్, ఉనాద్కత్, ధవల్​ కులకర్ణి ప్రత్యర్థిని అడ్డుకునేందుకు అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు.

వార్నర్ ఈనెల 29న ఈ సీజన్​లో చివరి మ్యాచ్​ ఆడనున్నాడు. అతని స్థానాన్ని భర్తీ చేసేందుకు న్యూజిలాండ్​ ఆటగాడు గప్తిల్ సిద్ధంగా ఉన్నాడు.

సన్​రైజర్స్​ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, రషీద్ ఖాన్, సందీప్ శర్మ... తమ బౌలింగ్​తో ప్రత్యర్థిని తికమక పెట్టేందుకు సిద్ధమవుతున్నారు.

జట్లు (అంచనా)

రాజస్థాన్ రాయల్స్
అజింక్యా రహానే(కెప్టెన్), స్టీవ్ స్మిత్, థామస్, సంజూ శాంసన్, స్టువర్ట్ బిన్ని, శ్రేయస్ గోపాల్, ఉనాద్కత్, రియాన్ పరాగ్, ధవల్ కులకర్ణి, వరుణ్ ఆరోన్, రాహుల్ త్రిపాఠి.

సన్​రైజర్స్ హైదరాబాద్
కేన్ విలియమ్సన్​(కెప్టెన్​), మనీశ్ పాండే, మార్టిన్ గప్తిల్​, డేవిడ్ వార్నర్​, దీపక్ హుడా, మహమ్మద్ నబీ, విజయ్ శంకర్​, ఖలీల్ అహ్మద్, భువనేశ్వర్ కుమార్, రషీద్ ఖాన్, సందీప్ శర్మ

ABOUT THE AUTHOR

...view details