తెలంగాణ

telangana

ETV Bharat / sports

రాజస్థాన్​ గూగ్లీలకు.. బెంగళూరు బోల్తా

జయపుర వేదికగా రాజస్థాన్​తో జరుగుతున్న మ్యాచ్​లో బెంగళూరు 158 పరుగులు చేసింది. పార్థివ్ పటేల్ అర్ధ శతకంతో రాణించాడు. రాజస్థాన్​ బౌలర్​ శ్రేయాస్ గోపాల్ మూడు వికెట్లతో చెలరేగాడు.

ఆరంభం అదిరినా... 158పరుగులే చేసిన బెంగళూరు

By

Published : Apr 2, 2019, 9:51 PM IST

రాజస్థాన్ రాయల్స్​తో జరుగుతున్న మ్యాచ్​లో రాయల్ ఛాలెంజర్స్​ బెంగళూరు 158 పరుగులు చేసింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్ జట్టు.. బెంగళూరుని తక్కువ స్కోరుకే పరిమితం చేసింది. ఆర్సీబీకి శుభారంభం దక్కినా శ్రేయాస్ గోపాల్ మూడు వికెట్లతో చెలరేగాడు. పార్థివ్ పటేల్ (67, 41బంతుల్లో) మినహా మిగతా బ్యాట్స్​మెన్​ పెద్దగా ఆకట్టుకోలేకపోయారు.

  • మూడు వికెట్లు తీసిన శ్రేయాస్..

తన తొలి ఓవర్లోనే విరాట్​ని (23) బౌల్డ్ చేసిన శ్రేయాస్ కొద్ది సేపటికే డివిలియర్స్(13), హిట్మైర్​ను(1) పెవిలియన్​కు​ చేర్చాడు. 4 ఓవర్లకు 12 పరుగులిచ్చి.. మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. జోఫ్రా ఆర్చర్ ఓ వికెట్ తీశాడు.

  • ఆరంభం అదిరినా...

మొదటి 8 ఓవర్లకి 70కిపైగా పరుగులు సాధించింది బెంగళూరు జట్టు. కొద్ది వ్యవధిలోనే డివిలియర్స్, హిట్మైర్ వికెట్లను కోల్పోయింది. పార్థివ్ పటేల్ అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. మిగతా బ్యాట్స్​మెన్ ధాటిగా ఆడలేకపోయారు. చివరి ఓవర్లో 17 పరుగులు సాధించిన బెంగళూరు గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. స్టాయినిస్(31), మొయిన్ అలీ (18) ఫర్వాలేదనిపించారు.

ABOUT THE AUTHOR

...view details