తెలంగాణ

telangana

ETV Bharat / sports

విజయవంతమైన ఆటగాడు అతడేనా..! - ముంబయి ఇండియన్స్

ఇండియన్ ప్రీమియర్ లీగ్​లో ముంబయి సారథి రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. ఈ టోర్నీలో అతడు పాల్గొన్న ప్రతి ఫైనల్​ మ్యాచ్​లోనూ విజయం సాధించాడు. ముంబయి కెప్టెన్​గా నాలుగుసార్లు ఐపీఎల్​ కప్పు అందుకున్నాడు.

ఐపీఎల్ సక్సెస్​ ప్లేయర్ అతడేనా..!

By

Published : May 13, 2019, 1:11 PM IST

ఆదివారం చెన్నైతో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్లో ముంబయి ఇండియన్స్ ఘన విజయం సాధించింది. నాలుగోసారి ఐపీఎల్ కప్పును ముద్దాడింది. సారథి రోహిత్ శర్మ.. ముంబయిని విజేతగా నిలిపి ఐపీఎల్​లో విజయవంతమైన ఆటగాళ్లలో ఒకడిగా నిలిచాడు. ఇంకో ఆశ్చర్యకర విషయం.... ఈ టోర్నీలో ఆడినా ఏ ఫైనల్ మ్యాచ్​లోనూ ఓటమి అనేదే లేదు రోహిత్ శర్మకు.​

2008లో ప్రారంభమైన ఈ పొట్టి లీగ్​లో డెక్కన్ ఛార్జర్స్​కు తొలిసారిగా ప్రాతినిధ్యం వహించాడు రోహిత్. ఆ సీజన్​లో ఆ జట్టు తరఫున అత్యధికంగా 404 పరుగులు చేశాడు. తర్వాతి ఏడాది వైస్​ కెప్టెన్​గా పదోన్నతి పొందాడు. అదే సంవత్సరం జోహెన్స్​బర్గ్ వేదికగా జరిగిన ఫైనల్​లో గెలిచి కప్పు సాధించిందీ జట్టు.

ఒక సంవత్సరం తర్వాత ముంబయి ఇండియన్స్ వేలంలో అతడిని దక్కించుకుంది. 2013 సీజన్​ మధ్యలో రికీ పాంటింగ్​ను తప్పించి రోహిత్​కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. సారథిగా తొలి సీజన్​లో విజయవంతమై జట్టును విజేతగా నిలిపాడు. తర్వాత 2015, 2017, 2019లో ముంబయిని విజయపథంలో నడిపించాడు.

ఇది చదవండి: నరాలు తెగే ఉత్కంఠలో.. నాలుగో టైటిల్​ నెగ్గిన ముంబయి

ABOUT THE AUTHOR

...view details