తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆర్​సీబీ జట్టులోకి డేల్ స్టెయిన్ - ఐపీఎల్ 2019

దక్షిణాఫ్రికా పేసర్ డేల్ స్టెయిన్​...ఐపీఎల్​లో ఆడబోతున్నాడు. కోహ్లి నాయకత్వం వహిస్తున్న ఆర్​సీబీ జట్టు తరఫున పేస్ బాధ్యతలు పంచుకోనున్నాడు.

ఆర్సీబీ జట్టులోకి డేల్ స్టెయిన్

By

Published : Apr 12, 2019, 7:36 PM IST

దక్షిణాఫ్రికా పేసర్ డేల్ స్టెయిన్ త్వరలో ఐపీఎల్​లో కనిపించనున్నాడు. కోహ్లి నాయకత్వం వహిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో పేస్ బాధ్యతలు పంచుకోనున్నాడు. గాయం కారణంగా సీజన్​కు దూరమైన కౌల్టర్​నైల్ స్థానాన్ని స్టెయిన్ భర్తీ చేయనున్నాడు.

'ఐపీఎల్​లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున మిగతా మ్యాచ్​ల్లో స్టెయిన్ ఆడనున్నాడు.' -ఐపీఎల్ ప్రతినిధి

2008, 2010లో ఆర్​సీబీకి ఆడి 27 వికెట్లు తీశాడు. ఐపీఎల్​లో ఇప్పటివరకు 9 ఎడిషన్స్​లో పాల్గొన్నాడీ సౌతాఫ్రికా పేసర్​.

గతేడాది జరిగిన వేలంలో అమ్ముడుపోలేదీ బౌలర్. 2016లో చివరిసారిగా గుజరాత్ లయన్స్ జట్టు తరఫున ఐపీఎల్​లో ప్రాతినిధ్యం వహించాడు.

ప్రస్తుత సీజన్​లో ఆడిన 6 మ్యాచ్​ల్లోనూ ఓటమిపాలైంది కోహ్లి సేన. మరి స్టెయిన్ రాకతోనైనా బలం పుంజుకుంటుందేమో చూడాలి.

ABOUT THE AUTHOR

...view details