తెలంగాణ

telangana

ETV Bharat / sports

మెరిసిన ధావన్-శ్రేయస్... బెంగళూరు లక్ష్యం 188 - ఆర్సీబీ

బెంగళూరుతో మ్యాచ్​లో దిల్లీ బ్యాట్స్​మెన్ ఆకట్టుకున్నారు. ప్రత్యర్థికి 188 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. శ్రేయస్ అయ్యర్, ధావన్ అర్ధశతకాలతో మెరిశారు.

మెరిసిన ధావన్-శ్రేయస్... బెంగళూరు లక్ష్యం 188

By

Published : Apr 28, 2019, 5:48 PM IST

సొంతగడ్డపై బెంగళూరుతో మ్యాచ్​లో నిర్ణీత 20 ఓవర్లలో 187 పరుగులు చేసింది దిల్లీ క్యాపిటల్స్. శ్రేయస్ అయ్యర్, ధావన్ అర్ధ శతకాలతో రాణించారు.

టాస్ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకుంది దిల్లీ. ఓపెనర్లు పృథ్వీషా, ధావన్.. తొలి బంతి నుంచి దూకుడుగా ఆడే ప్రయత్నం చేశారు. కానీ 18 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పృథ్వీషా ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్.. ధావన్​తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఆ క్రమంలో ఇద్దరూ అర్ధ సెంచరీలను పూర్తి చేసుకున్నారు.

మిగతా బ్యాట్స్​మెన్​లో పంత్ 7, ఇంగ్రామ్ 11 పరుగుల చేసి పెవిలియన్ బాట పట్టారు. చివర్లో వచ్చిన రూథర్​ఫర్డ్ 28, అక్షర్ పటేల్ 16 మెరుపులతో 187 పరుగులు స్కోరు సాధించారు.

బెంగళూరు బౌలర్లలో చాహల్ రెండు వికెట్లు తీశాడు. ఉమేశ్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, సైనీ తలో వికెట్ తీశారు.

ABOUT THE AUTHOR

...view details