హైదరాబాద్ సన్‌రైజర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ ఎంచుకుంది. జైపూర్ వేదికగా ఈ పోరు జరుగుతోంది. సొంతగడ్డపై ఆడుతుండటం రాజస్థాన్ రాయల్స్‌కు కలిసొచ్చే అంశం. విజయం సాధించి ఫ్లే ఆఫ్ రేసులో ముందడుగు వేయాలని భావిస్తోంది సన్‌రైజర్స్.
ఇరు జట్లలోని ఇంగ్లండ్ ఆటగాళ్లు ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేరు. ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా రైజర్స్ ఓపెనర్ బెయిర్‌స్టో, రాయల్స్ జట్టులోని ఆర్చర్, బట్లర్, స్టోక్స్ వారి స్వదేశానికి పయనమయ్యారు.
ఈ మ్యాచ్‌లో వార్నర్ ఓ రికార్డుకు చేరువగా ఉన్నాడు. మరో అర్ధ సెంచరీ చేస్తే ఓ ఐపీఎల్ సీజన్లో వరుసగా ఆరు హాఫ్ సెంచరీలు చేసిన తొలి క్రికెటర్‌గా నిలుస్తాడు. ప్రస్తుతం సెహ్వాగ్(5), బట్లర్(5)లతో సమంగా ఉన్నాడీ ఆసీస్ బ్యాట్స్‌మెన్.