తెలంగాణ

telangana

ETV Bharat / sports

రాయల్స్​పై 12 పరుగుల తేడాతో పంజాబ్​ విజయం

మొహాలి వేదికగా రాజస్థాన్​తో జరిగిన మ్యాచ్​లో కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​ 12 పరుగుల తేడాతో గెలుపొందింది. 183 పరుగుల లక్ష్య ఛేదనలో 20 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 170 పరుగులు మాత్రమే చేయగలిగింది రాజస్థాన్​.

12 పరుగుల తేడాతో పంజాబ్​ విజయం

By

Published : Apr 17, 2019, 12:04 AM IST

మొహాలీలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్​లో 183 పరుగులు చేయలేక తడబడింది రాజస్థాన్​ రాయల్స్​. త్రిపాఠి అర్ధశతకంతో రాణించినా.. చివర్లో బిన్నీ సిక్సర్లతో విరుచుకుపడినా రహానే జట్టుకు పరాజయం తప్పలేదు. తొలుత బ్యాటింగ్​కు దిగిన పంజాబ్​ జట్టు 20 ఓవర్లలో 182 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో 20 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 170 పరుగులు మాత్రమే చేయగలిగింది రాజస్థాన్​. మ్యాన్​ ఆఫ్​ ద మ్యాచ్ అశ్విన్​కు లభించింది

స్లో ఛేజింగ్​....

మంచి బౌలింగ్​ లైనప్​ ఉన్న పంజాబ్...​ రాజస్థాన్​ బ్యాట్స్​మెన్లను బాగా కట్టడి చేసింది. రాహుల్​ త్రిపాఠి(50; 45 బంతుల్లో) అర్ధశతకంతో రాణించాడు. బట్లర్​ 23, సంజు 27, రహానే 26 తక్కువ పరుగులకే పరిమితమయ్యారు. ఆఖర్లో బిన్నీ(33;11 బంతుల్లో 2ఫోర్లు,3 సిక్సులు) విరుచుకుపడినా జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయాడు.
పంజాబ్​ బౌలర్లలో అశ్విన్​, షమీ, అర్ష్​దీప్​ సింగ్​ రెండేసి వికెట్లు తీశారు. మురుగన్​ అశ్విన్​ ఒక వికెట్​ ఖాతాలో వేసుకున్నాడు.

గేల్​ శుభారంభం...

మొదట బ్యాటింగ్​ చేసిన అశ్విన్​ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లకు 182 పరుగులు చేసింది.​ పంజాబ్​ బ్యాట్స్​మెన్లు రాహుల్​, క్రిస్​గేల్​ మంచి ఆరంభాన్నిచ్చారు. గేల్​ (30; 22 బంతుల్లో 2ఫోర్లు, 3 సిక్సులు) వేగంగా పరుగులు చేశాడు.

రక్షించిన రాహుల్​..

రాహుల్​ (52; 47 బంతుల్లో 3ఫోర్లు, 2 సిక్సులు) పరుగులతో మంచి ఇన్నింగ్స్​ ఆడాడు. మిల్లర్​ 27 బంతుల్లో 40 పరుగులతో రాణించడంతో మంచి స్కోరు సాధించారు. చివర్లో వచ్చిన అశ్విన్​ 4 బంతుల్లో 17 పరుగులు చేశాడు.

రాజస్థాన్​ బౌలర్లలో... ఆరెంజ్​ క్యాప్​తో కొనసాగుతున్న ఆర్చర్​ బాగా ఆకట్టుకున్నాడు. 4 ఓవర్లు వేసిన ఈ పేసర్​ 15 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. కులకర్ణి, ఉనద్కత్​, సోథీ తలో వికెట్​ ఖాతాలో వేసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details