ముంబయి - చెన్నై మధ్య జరుగుతున్న మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ చివరి ఓవర్లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. అంపైర్లు వైడ్ ప్రకటించకపోయే సరికి ఆగ్రహంతో పొలార్డ్ బ్యాట్ గాల్లోకి విసిరిపట్టుకుని వ్యంగ్యంగా తన అసంతృప్తి తెలిపాడు.
బర్త్‌డే రోజు బ్యాట్‌ను గాల్లోకి విసిరిన పొలార్డ్.. ! - match
హైదరాబాద్ వేదికగా ముంబయి - మధ్య జరుగుతున్న ఫైనల్లో బౌలర్‌ను కవ్వించాడు కీరన్ పొలార్డ్. అంపైర్లు వైడ్ ఇవ్వకపోవడంతో అసహనానికి గురైన విండీస్ ఆటగాడు బ్యాట్‌ను గాల్లోకి విసిరి అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ రోజు పొలార్డ్ జన్మదినం కావడం విశేషం.
బ్రావో బౌలింగ్‌లో మొదటి బంతికి పరుగేమీ రాలేదు. రెండో బంతిని ఆఫ్ స్టంప్ దిశగా వేయగా వైడ్ అనుకున్నాడు పొలార్డ్. కానీ అంపైర్ ఎలాంటి సంకేతం ఇవ్వలేదు. మూడో బంతి అలాగే వేయగా అప్పుడు కూడా అంపైర్ స్పందించలేదు. దీనిపై అసంతృప్తి చెందిన పొలార్డ్ ఆగ్రహంతో బ్యాట్‌ను గాల్లోకి విసిరి పట్టుకున్నాడు. అంతేకాకుండా వైడ్ లైన్ బయటి కొచ్చి బ్యాట్ పట్టుకుని నిల్చున్నాడు. తీరా నాలుగో బంతి వేసే సమయానికి క్రీజు నుంచి బయటికెళ్లి బౌలర్‌ను కవ్వించాడు. అనంతరం అంపైర్లు పొలార్డ్‌ను హెచ్చరించారు. చివరి 2 బంతులను ఫోర్లుగా మలిచాడు బర్త్‌డే బాయ్.
ఇంతకు ముందు కూడా బ్రావో బౌలింగ్‌లో చాలా సార్లు పొలార్డ్ విభిన్నంగా స్పందించాడు. ఈ రోజు తన జన్మదినం సందర్భంగా 25 బంతుల్లోనే 41 పరుగులు చేసి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడీ కరేబియన్ ఆటగాడు.