తెలంగాణ

telangana

ETV Bharat / sports

సూపర్​ ఓవర్లో గెలిచి.. ఫ్లేఆఫ్​​ చేరిన ముంబయి

ఉత్కంఠగా సాగిన ముంబయి, హైదరాబాద్​ మ్యాచ్​లో సూపర్​ ఓవర్లో రోహిత్​ సేన విజయం సాధించింది. ఈ గెలుపుతో ప్లేఆఫ్స్​కు అర్హత సాధించిన మూడో జట్టుగా నిలిచింది. ఇప్పటికే చెన్నై, దిల్లీ ప్లేఆఫ్​ చేరాయి. చివరి బెర్త్​ కోసం 4 జట్లు పోరాడుతున్నాయి.

సూపర్​ ఓవర్లో గెలిచి.. ఫ్లేఆఫ్​​ చేరిన ముంబయి

By

Published : May 3, 2019, 12:51 AM IST

Updated : May 3, 2019, 7:28 AM IST

చివరి బంతికి 7 పరుగులు సాధించాల్సిన దశలో సిక్సర్​తో మ్యాచ్​ను సూపర్​ ఓవర్​కు వెళ్లేలా చేశాడు సన్​రైజర్స్​ బ్యాట్స్​మెన్​ మనీష్​ పాండే.

సూపర్​ ఓవర్​ సాగిందిలా...

ముందుగా బ్యాటింగ్​కు​ దిగిన హైదరాబాద్​ జట్టు మనీష్​​ పాండే, నబీని ఓపెనర్లుగా పంపింది. తొలి బంతికే రెండో పరుగు కోసం యత్నించిన పాండే రనౌట్​గా వెనుదిరిగాడు. తర్వాత గప్తిల్​ సింగిల్​ తీయగా, నబీ మూడో బంతిని కళ్లు చెదిరే సిక్సర్​గా మలిచాడు. అయితే తర్వాతి బంతికే బుమ్రా వేసిన సూపర్​ యార్కర్​కు బౌల్డయ్యాడు నబీ. 2 వికెట్లు కోల్పోవడం వల్ల హైదరాబాద్​ 8 పరుగులకు ఆలౌటయింది. సూపర్​ఓవర్లో 2 వికెట్లు కోల్పోతే ఇన్నింగ్స్​ ముగిసినట్లే.

తొలి బంతికే...

చివరి బంతికి సిక్సర్​ ఇచ్చి మ్యాచ్​ డ్రా కావడానికి కారణమైన పాండ్య... సూపర్ ఓవర్​ తొలి బంతికే సిక్సర్​ బాదాడు. రషీద్​ ఖాన్​ వేసిన ఈ ఓవర్లో రెండో బంతికి సింగిల్​ రాగా, మూడో బంతికి 2 పరుగులు తీసి పొలార్డ్ ముంబయిని గెలిపించాడు. ఈ మ్యాచ్​ విజయంతో ప్లే ఆఫ్స్​కి చేరిన 3వ జట్టుగా​ నిలిచింది ముంబయి.

బుమ్రాకు ప్లేయర్​ ఆఫ్​ ద మ్యాచ్​ అవార్డు దక్కింది.

Last Updated : May 3, 2019, 7:28 AM IST

ABOUT THE AUTHOR

...view details