ముంబయి, చెన్నై మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది ధోని సేన. వరుసగా 3 విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది చెన్నై సూపర్ కింగ్స్. ధోని ఫామ్ జట్టుకు మరింత ఉత్సాహాన్నిస్తుంది.
ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఒకటి మాత్రమే గెలిచింది ముంబయి. పేస్ బౌలింగ్ పటిష్ఠంగా ఉన్నా.. మ్యాచ్‌లు గెలవలేకపోతుంది.
ఇరుజట్లు తలపడిన మ్యాచ్‌ల్లో ముంబయి ఎక్కువసార్లు గెలిచింది. చెన్నైతో జరిగిన గత 5 మ్యాచ్‌ల్లో నాలుగు మ్యాచ్‌ల్లో ముంబయి విజయం సాధించడం విశేషం. మొత్తంగా సూపర్ కింగ్స్‌పై 14-12 తేడాతో రోహిత్ సేనదే పైచేయి.
ఐపీఎల్ గణంకాలు:
చెన్నై సూపర్ కింగ్స్ మొత్తంగా 151 మ్యాచులు ఆడింది. అందులో 93 గెలిచి, 56 ఓటమిపాలైంది.
ముంబయి ఇండియన్స్ మొత్తంగా 174 మ్యాచులు ఆడింది. 99 గెలిచి(ఒక సూపర్ ఓవర్ గెలుపు), 75 ఓడింది. నేడు గెలిస్తే ఐపీఎల్లో 100వ గెలుపు నమోదు చేసిన తొలి జట్టుగా రికార్డు సృష్టిస్తుంది.
రోహిత్ శర్మ (కెప్టెన్), డికాక్, సూర్య కుమార్ యాదవ్, యువరాజ్ సింగ్, పొలార్డ్, హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్య, రాహుల్ చాహర్, బుమ్రా, లసిత్ మలింగ, బెహ్రెండార్ఫ్.
ధోనీ(కెప్టెన్), సురేశ్ రైనా, అంబటి రాయుడు, వాట్సన్, కేదార్ జాదవ్, డ్వేన్ బ్రావో, రవీంద్ర జడేజా, దీపక్ చాహర్, మోహిత్ శర్మ, శార్దుల్ ఠాకుర్, ఇమ్రాన్ తాహిర్