తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆరు వికెట్లతో అదరగొట్టిన అల్జారీ... రైజర్స్ పరాజయం - వార్నర్​

ముంబయితో జరిగిన మ్యాచ్​లో హైదరాబాద్ 40 పరుగుల తేడాతో ఓడిపోయింది. ముంబయి బౌలర్​ అల్జారీ జోసెఫ్ 6 వికెట్లతో విజృంభించాడు. ఐపీఎల్ చరిత్రలో ఏ బౌలర్​కి సాధ్యం కాని రికార్డు సొంతం చేసుకున్నాడు. 48 పరుగులతో పొలార్డ్ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

ఆరు వికెట్లతో అదరగొట్టిన అల్జారీ...రైజర్స్ పరాజయం

By

Published : Apr 6, 2019, 11:51 PM IST

సొంతగడ్డపై ముంబయి ఇండియన్స్​తో జరిగిన మ్యాచ్​లో సన్​రైజర్స్ హైదరాబాద్ 40 పరుగుల తేడాతో పరాజయం చెందింది. 137 పరుగుల లక్ష్య ఛేదనలో 96 పరుగులకే కుప్పకూలింది. ముంబయి బౌలర్​ అల్జారీ జోసెఫ్ 6 వికెట్ల తీసి హైదరాబాద్ పతనాన్ని శాసించాడు. 33 పరుగులకే సన్​రైజర్స్ ఓపెనర్లు ఔట్ ​కాగా మిగతా బ్యాట్స్​మెన్ వరసగా పెవిలియ​న్​కు క్యూ కట్టారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్​గా అల్జారీ జోసెఫ్ ఎంపికయ్యాడు.

  • మొదట బ్యాటింగ్ చేసిన ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో 136 పరుగులు చేసింది. మొదట బ్యాట్స్​మెన్​ తడబడ్డా.. చివర్లో పోలార్డ్ 26 బంతుల్లో 46 పరుగులు చేసి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. ఈ పరుగులే ముంబయి గెలుపులో కీలకపాత్ర పోషించాయి.

అదరగొట్టిన అల్జారీ జోసెఫ్...

లక్ష్యచేధనలో హైదరాబాద్​ బ్యాట్స్​మెన్​ తడబడ్డారు. మంచి ఫామ్​లో ఉన్న బెయిర్​స్టోను(16) ముంబయి బౌలర్​ రాహుల్ ఔట్ చేశాడు. అనంతరం తన తొలి బంతికే వార్నర్​ని(15) బౌల్డ్ చేశాడు అల్జారీ జోసెఫ్. తర్వాత మిగతా బ్యాట్స్​మెన్ వేగంగా పరుగుల రాబట్టుకోవడంలో ఇబ్బంది పడ్డారు. విజయశంకర్(5), హుడా(20), రషీద్ ఖాన్(0), భువనేశ్వర్ కుమార్(2), సిద్ధార్ధ కౌల్(0)పెవిలియన్ పంపాడు అల్జారీ. మొత్తం ఆరు వికెట్ల తన ఖాతాలో వేసుకున్నాడు జోసెఫ్.

  1. ఆడిన తొలి మ్యాచ్​లోనే ఆరు వికెట్ల తీసి రికార్డు సృష్టించాడు అల్జారీ. ఐపీఎల్ చరిత్రలో ఇంతవరకు ఏ బౌలర్​కు సాధ్యం కాని రికార్డును సొంతం చేసుకున్నాడీ కరేబియన్ బౌలర్.
  2. 3.4 ఓవర్లు వేసి కేవలం 12 పరుగులే ఇచ్చాడు జోసెఫ్. అందులో ఓ మేడిన్ ఉంది.

సన్​రైజర్స్ బౌలర్లలో కౌల్ రెండు వికెట్లు తీయగా... సందీప్, భువి, నబీ తలో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ మ్యాచ్​లో పేలవ ఫీల్డింగ్​తో ముంబయికి అదనపు పరుగులు సమర్పించుకుంది సన్​రైజర్స్ జట్టు.

ABOUT THE AUTHOR

...view details